మెగా వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పరిచయం అవసరం లేదు ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన తదుపరి సినిమాలన్నింటిని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.
ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకున్నారు.
తాజాగా రామ్ చరణ్ ది ట్రూ లెజెండ్ ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డుకు రామ్ చరణ్ ఎంపికయ్యారు.
ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఈ అవార్డును అందుకోవడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ అవార్డు అందుకున్న అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.నాన్న.నిన్ను చూస్తుంటే చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది.ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది.భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చిరంజీవి తన కుమారుడు అందుకున్న ప్రతిష్టాత్మకమైన అవార్డు పట్ల ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే మెగా అభిమానులు సైతం రాంచరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తు పోస్టులు పెడుతున్నారు.







