ఆ దర్గాకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో(Kadapa district) ఎన్నో దర్గాలు ఉన్న విషయం తెలిసిందే.అయితే వీటిలో కొన్ని పెద్ద దర్గాలు కూడా ఉన్నాయి.

ఈ దర్గాలో ప్రతి ఏడాది నేషనల్ ముషాఇరా గజల్(National Mushaira Ghazal) ఈవెంట్ ను నిర్వహిస్తూ ఉంటారు.అలా ఈ ఏడాది 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌ ను నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలివస్తున్నారు.కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా పలువురు సెలబ్రిటీలు సైతం హాజరవుతున్నారు.

ఇప్పటికే ఏఆర్ రెహమాన్ (AR Rahman)వంటి వారు సందర్శించిన విషయం తెలిసిందే.తాజాగా రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా దర్గాను సందర్శించిన రామ్ చరణ్ మాట్లాడుతూ.

Advertisement

ఈ దర్గా 80వ నేషనల్‌ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌ కు నన్ను పిలిచినందుకు నిర్వాహకులకు ధన్యవాదాలు.నా కోసం వచ్చిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.12 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చాను.నా కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా మగధీర.

ఆ సినిమా రిలీజ్‌ కు ఒక్కరోజు ముందు ఈ దర్గాకు వచ్చాను.ఇక్కడి పెద్దల ఆశీర్వాదాలు తీసుకున్నాను.

ఆ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే.

నాకు మంచి స్టార్‌డమ్‌ తీసుకొచ్చింది.ఈ దర్గాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను.నాన్నగారు కూడా ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చారు.

ఈ సింపుల్ మాస్క్ తో పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే గ్లోయింగ్ అండ్ గ్లాస్ స్కిన్ పొందవచ్చు..!
ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని.. సింగర్ సునీత కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుతో చేయనున్న సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌(AR Rahman) సంగీతం అందిస్తున్నారు.ఆయన నాకు ఈ కార్యక్రమం గురించి చెప్పారు.

Advertisement

కచ్చితంగా ఈ ముషాయిరా గజల్‌ ఈవెంట్‌కు వస్తానని రెహమాన్‌ కు మాట ఇచ్చాను.ఇప్పుడు అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ ఆయనకు ఇచ్చిన మాట తప్పకూడదని ఇక్కడికి వచ్చాను.

ఎంతో ఆనందంగా ఉంది అని రామ్ చరణ్ అన్నారు.రామ్‌ చరణ్‌ తో పాటు దర్శకుడు బుచ్చిబాబు కూడా ఈ దర్గాను సందర్శించారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

తాజా వార్తలు