ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి స్తున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.ఈ చిత్రం చిరంజీవి 152 వ సినిమాగా రాబోతుంది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.ఆచార్య సినిమాను కొరటాల శివ సామజిక అంశాలతో రూపొందిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర దాదాపు 45 నిముషాల పాటు ఉంటుంది.ఇందులో రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
పూజ హెగ్డే రామ్ చరణ్ సరసన ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో కొద్దీ సమయం కనిపించి ప్రేక్షకుల్ని అలరించ బోతుంది.వీరిద్దరి మీద ఒక రొమాంటిక్ సాంగ్ కూడా ఉంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ద అనే పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమాలో చరణ్ పాత్రపై ఒక షెడ్యూల్ పూర్తి చేసాడు కొరటాల.
ఇప్పుడు ఫైనల్ షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నాడు.ఈ షెడ్యూల్ కోసం ఇప్పటికే హైదరాబాద్ లో ఒక భారీ సెట్ కూడా వేసారట.
ఈ సెట్ లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించ బోతున్నారని సమాచారం.

రామ్ చరణ్ కు సోనూసూద్ మధ్య ఒక భారీ యాక్షన్ సీన్స్ ను కొరటాల ప్లాన్ చేసాడని తెలుస్తుంది.ఇది రైన్ ఫైట్ అని దీనిని కొరటాల తన మార్క్ కనిపించేలా చూపించబోతున్నాడని సమాచారం.ఈ సినిమాలో ఈ ఫైట్ హైలెట్ గా నిలుస్తుందని టాక్.
ఈ సినిమాను కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా మే 13 న విడుదల అవ్వబోతుంది.







