నా గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు.. రామ్ చరణ్ స్వీట్ పోస్ట్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న రామ్ చరణ్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే నిన్న (ఫిబ్రవరి 18) తన తల్లి కొణిదెల సురేఖ పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

ఈ క్రమంలోనే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మంది అభిమానులను ఆకట్టుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున అభిమానులు కూడా తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ తన తల్లి పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.

నా గురించి నీకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అమ్మా.హ్యాపీ బర్త్ డే అమ్మ అంటూ తన తల్లికి ఎంతో ప్రేమగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది.ఈ క్రమంలోనే ఎంతో మంది మెగా అభిమానులు ఈ పోస్ట్ పై స్పందిస్తూ రామ్ చరణ్ తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఆచార్య సినిమా షూటింగ్ లొకేషన్ లో భాగంగా తన తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేశారు.

ఇక సురేఖ పుట్టినరోజు కావడంతో ఉపాసన కూడా సోషల్ మీడియా వేదికగా హ్యాపీ బర్త్ డే మై డియరెస్ట్ అత్తమ్మ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ఈయన నటించిన ఆచార్య, RRR సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో RC#15 సినిమా షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.

ఇవే కాకుండా రామ్ చరణ్ మరి కొన్ని సినిమాలను కూడా లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు