చరణ్ తో ఆ పని చేయిస్తున్న ఉపాసన.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ పిక్!

ఎంతటి వారైనా పెళ్ళానికి పాదదాసి అనే అంటారు పెద్దవారు.మరి ఇది పేదవారు, డబ్బున్న వారు లేదంటే సెలెబ్రిటీలు అనే బేధం లేకుండా అందరికి వర్తిస్తుంది.

 Ram Charan Shares A Lovely Pic With Wife Upasana, Ram Charan, Upasana, Social Me-TeluguStop.com

కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి చూస్తుంటే అదే అనిపిస్తుంది.తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆయన భార్య ఉపాసన మధ్య జరిగిన ఫన్ మూమెంట్ కు సంబంధించిన పిక్ నెట్టింట వైరల్ అవుతుంది.

ప్రస్తుతం రామ్ చరణ్ ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుల వేడుక కోసం అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి తో పాటు మరికొంత మంది మెంబర్స్ యూఎస్ చేరుకున్నారు.

మార్చి 12న జరగనున్న ఈ వేడుక కోసం అంతా సిద్ధం అయ్యారు.మరి ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కూడా యూఎస్ వెళ్ళింది.

మరి ముందుగానే చరణ్ దంపతులు అక్కడికి చేరుకోవడంతో ఈ గ్యాప్ లో తమ బ్యూటిఫుల్ టైం ను ఆనందంగా గడుపుతున్నారు.ఈ క్రమంలోనే కొన్ని క్రేజీ పిక్స్ నెట్టింట పంచు కోవడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.తాజాగా వీరు షేర్ చేసుకున్న ఫొటోల్లో ఒక ఫోటో మాత్రం అభిమానులను మరింత ఆకట్టు కోవడమే కాకుండా ఫన్ జనరేట్ చేసింది.

ఈ పిక్ లో ఉపాసన ముందు నడుస్తుంటే వెనుక చరణ్ ఉపాసన చేసిన షాపింగ్ బ్యాగ్స్ ను మోస్తూ కనిపిస్తున్నాడు.దీంతో ఈ పిక్ చూసిన ఫ్యాన్స్ అంతా పెళ్ళైన తర్వాత ప్రతీ మగవాడు ఇలా చేయాల్సిందే.ఎంతటి వాడైనా పెళ్ళాం కొంగుపట్టుకుని తిరగాల్సిందే అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో నెట్టింట ఈ పిక్ బాగా చక్కర్లు కొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube