చరణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరు..?

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఆర్.ఆర్.

ఆర్ తర్వాత శంకర్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం లొకేషన్స్ వేటలో ఉన్న ఈ సినిమా నుండి ప్రతి అప్డేట్ మెగా ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇస్తుంది.

ఇప్పటికే సినిమాలో హీరోయిన్ గా కియరా అద్వానిని ఫిక్స్ చేయగా లేటెస్ట్ గా సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.ఆ అవకాశాన్ని సీనియర్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నాకి ఇస్తున్నట్టు టాక్.

సినిమాలో సెకండ్ హీరోయిన్ కు ఇంపార్టెంట్ రోల్ ఉందట.ఆ పాత్రకి తమన్నా పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారట.

Advertisement

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ లో తమన్నా సూపర్ ఫాం లో ఉంది.పాన్ ఇండియా సినిమాలో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

ఆల్రెడీ బాహుబలి లో కూడా తమన్నా నటించిన విషయం తెలిసిందే.సౌత్ తో పాటుగా నార్త్ ఆడియెన్స్ కు పరిచయం ఉన్న తమన్నాకి వరుస అవకాశాలు వస్తున్నాయి.

మరి ఆర్సీ 15లో తమన్నా ఉంటుందా లేదా అన్న క్లారిటీ త్వరలో తెలుస్తుంది.ఈ సినిమాలో రాం చరణ్ పాత్ర కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది.

స్వెటర్‌ వేసుకొని నిద్రిస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
Advertisement

తాజా వార్తలు