మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని స్టార్ అయ్యాడు.ఈ సినిమాతో హిట్ కొట్టిన రామ్ చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.
ఇండియన్ అగ్ర దర్శకులు అయినా రాజమౌళి, శంకర్ లతో ఈయన బ్యాక్ టు బ్యాక్ పని చేస్తూ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.
ఇలా ఇప్పుడు ఉన్న స్టార్ దర్శకులిద్దరితో పని చేసిన ఘనత ఈయనకే సొంతం.
కాగా మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాపై పెరుగుతున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని శంకర్ కూడా కీలక జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
అలాగే రామ్ చరణ్ లుక్ లో కూడా విభిన్నంగా చూపించ నున్నట్టు తెలుస్తుంది.ఇప్పటికే ఈయన లుక్స్ కూడా బయటకు వచ్చి నెట్టింట వైరల్ అయ్యాయి.
అయితే తాజాగా ఈ సినిమా విషయంలో ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో ఖర్చు ఉంటుందో తెలిసిందే.
ఆలే దిల్ రాజు చెయ్యక చెయ్యక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.ఈ సమయంలో ఇప్పటికే దిల్ రాజు చేత చాలా ఖర్చు పెట్టిస్తున్నారు శంకర్.
ఇక ఇప్పుడు ఏకంగా దుబాయ్ లో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాడని టాక్.

ఈ సినిమా పూర్తి కావొస్తున్నా నేపథ్యంలో సినిమాకు సంబందించిన ఈవెంట్ ను దుబాయ్ లో ప్లాన్ చేయాలని అనుకుంటున్నారట.అక్కడ ఈవెంట్ అంటే ఖర్చు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు.అక్కడ ఈవెంట్ చేస్తే ఈ సినిమా ప్రొమోషన్ పరంగా చాలా బాగుంటుంది అని శంకర్ ఆలోచన అట.ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ తో పాటు మరి కొంత మంది స్టార్ హీరోలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయట.ఇప్పటికే బడ్జెట్ బాగా పెడుతున్నాడు.
ఇంకా ప్రొమోషన్స్ కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేయిస్తాడో.మొత్తానికి దిల్ రాజు ఈ సినిమా కోసం డబ్బును బాగానే ఖర్చు చేస్తున్నారు.