చరణ్-శంకర్ మూవీ టైటిల్ ఇదే.. ''గేమ్ చేంజర్''గా రాబోతున్న మిస్టర్ బాక్సాఫీస్!

Ram Charan RC15 Title Reveal Details, RC15 Title, Director Shankar, Ram Charan, RC15, Game Changer, Ram Charan Birthday, Ram Charan Game Changer Movie, Shankar Ram Charan , Rc15 Movie Title, Kiara Advani

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఈ రోజు పుట్టిన రోజును జరుపు కుంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన నటించే కొత్త సినిమాల అప్డేట్ ల కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

 Ram Charan Rc15 Title Reveal Details, Rc15 Title, Director Shankar, Ram Charan,-TeluguStop.com

మరి మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది.ఈ రోజు మిస్టర్ బాక్సాఫీస్ పుట్టిన రోజు కానుకగా ఆయన నటిస్తున్న సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ట్రిపుల్ ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో రామ్ చరణ్ కు గ్లోబల్ వైడ్ గా మరింత పేరు వచ్చింది అనే చెప్పాలి.మరి ఆస్కార్ సెలెబ్రేషన్స్ ను ఇప్పుడిప్పుడే బయటపడుతున్న చరణ్ కు మళ్ళీ బర్త్ డే సెలెబ్రేషన్స్ (Ram Charan Birthday) పలకరిస్తున్నాయి.

రెండు మూడు రోజుల ముందునుండే చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ స్టార్ట్ చేసి హంగామా చేస్తున్నారు.

చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC15’ సెట్స్ లో కూడా రెండు రోజులు ముందుగానే సెలెబ్రేషన్స్ చేసారు.మరి ముందుగానే బర్త్ డే వేడుకలను సెలెబ్రేట్ చేసిన టీమ్ ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాకు ”గేమ్ ఛేంజర్” (Game Changer) అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇది పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఈ టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది.

టైటిల్ ప్రకటిస్తూ చిన్న వీడియోను కూడా వదిలారు.ఈ వీడియోలో శంకర్ మార్క్ భారీ విజువల్స్ తో గ్లోబల్ వైడ్ ఆకట్టుకునే విధంగా అందరిని టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.అయితే చరణ్ లుక్ మాత్రం రివీల్ చేయకపోవడంతో కొద్దిగా నిరాశ చెందారు.

అయినా కూడా ఎన్నాళ్ళ నుండో ఒక్క అప్డేట్ అంటున్న ఫ్యాన్స్ టైటిల్ తో సరిపెట్టుకుంటున్నారు.కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.చూడాలి ఈ సినిమాతో ట్రిపుల్ ఆర్ విజయాన్ని కంటిన్యూ చేస్తాడో లేదో.

https://youtu.be/E3_cz3uv43c

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube