పొట్ట కొవ్వును మాయం చేసే దాల్చిన చెక్క.. రోజు ఇలా తీసుకుంటే మరెన్నో బెనిఫిట్స్!

చాలా మంది తమ పొట్ట లావుగా ఉందని లోలోన తెగ మదన పడుతూ ఉంటారు.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవాలని తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

 Cinnamon Helps To Reduce Belly Fat Naturally , Cinnamon, Cinnamon Benefits, Late-TeluguStop.com

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు దాల్చిన చెక్క( Cinnamon ) చాలా అద్భుతంగా సహాయపడుతుంది.కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క సూప‌ర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.ముఖ్యంగా దాల్చిన చెక్కను ఇప్పుడు చెప్పబోయే విధంగా ప్రతిరోజు తీసుకుంటే పొట్ట కొవ్వు ( belly fat )మాయం అవ్వడమే కాదు మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

మరి ఇంకెందుకు లేటు దాల్చిన చెక్కను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి ( Cinnamon powder )వేసి కనీసం పది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ దాల్చిన చెక్క వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మిక్స్ చేసి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.

Telugu Belly Fat, Cinnamon, Flat Stomach, Tips, Latest-Telugu Health

ప్రతిరోజు ఉదయాన్నే ఈ దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.కొద్ది రోజుల్లోనే మీ బాన పొట్ట ఫ్లాట్ గా మారుతుంది.అంతేకాదు ఈ దాల్చిన చెక్క వాటర్ ను తాగడం వల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది.

దాంతో క్యాలరీలు త్వరగా బర్న్ అయి బరువు తగ్గుతారు.

Telugu Belly Fat, Cinnamon, Flat Stomach, Tips, Latest-Telugu Health

అలాగే ఈ దాల్చిన చెక్క వాటర్ ను తాకడం వల్ల గుండెపోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.మధుమేహం దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.ఆల్రెడీ మ‌ధుమేహం బారిన ప‌డితే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

దాల్చిన చెక్క వాటర్ ను రెగ్యులర్ గా తీసుకుంటే మొటిమలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.చర్మం యవ్వనంగా మెరుస్తుంది.జలుబు దగ్గు వంటి సమస్యలు ఉంటే దూరం అవుతాయి.మరియు శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలు మలినాలు తొలగిపోతాయి.

బాడీ డీటాక్స్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube