మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉంది .2007 లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో చిరుత మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ .వారసత్వం అనేది కేవలం సినిమాల్లోకి రావడానికి ఎంట్రీ పాస్ లాంటిది ,సినిమా ఇండస్ట్రీ లోకి రావాలి ఖచ్చితంగా హార్డ్ వర్క్ తో పాటు టాలెంట్ కూడా ఉండాలి ,ఇక చిరుత సినిమాతో రామ్ చరణ్ ఎంట్రీ పాస్ అయితే దొరికింది గాని , ఆ తరువాత రామ్ చరణ్ తన సొంత కష్టంతో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సక్సెస్ అయ్యారు అంటే , దానికి రామ్ చరణ్ హార్డ్ వర్క్ డెడికేషన్ ప్రధాన కారణాలు అని మెగా స్టార్ రామ చరణ్ గురుంచి పలు సందర్భాల్లో వివరించారు ధ్రువ సినిమా తో రామ్ చరణ్ స్టోరీ సెలెక్షన్ విషయంలో చాలా మార్పులు వచ్చాయి.ఇక ధ్రువ సినిమా రీమేక్ సినిమా అయినా ,కంటెంట్ బలంగా ఉంది కాబట్టే సినిమా పెద్ద సక్సెస్ అయింది .రొటీన్ జానర్స్ లాంటి సినిమాలు చెయ్యాలని ఏ హీరో కోరుకోరు , ఒక్కో డిఫెరెంట్ సబ్జెక్ట్ , ఒక్కో జానర్ తో పాటు అప్పుడప్పుడు ఎక్సపెరిమెంటల్ సినిమాలు కూడా చెయ్యాలని స్టార్ హీరోస్ తో పాటు ప్రేక్షకులు కోరుకుంటున్నారు.ఇక అసలు విషయానికి వస్తే ధ్రువ సినిమా సక్సెస్ తో రామ్ చరణ్ స్టోరీ సెలెక్షన్ మీద చాలా దృష్టి పెట్టారు .
ఒక రియలిస్టిక్ అప్రోచ్ కధలో కొత్తధనం ,రియాలిటీ సబ్జెక్ట్ ,మాస్ జానర్ లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .ఇక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ ప్రేక్షకులు స్టన్ అయిపోయారు .రామ్ చరణ్ ఈ సినిమా లో చేసిన చిట్టి బాబు పాత్ర కు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది .ఇక రంగస్థలం సినిమాతో సక్సెస్ అందుకొని ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తారు అని అనుకుంటున్న సమయంలో ,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో వినయ విధేయ రామ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ,కానీ ఈ మూవీ ట్రైలర్స్ ,టీజర్స్ ,సాంగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ అందుకుంది .

బాహుబలి సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ రాజమౌళి ఆ తరువాత కూడా అదే పాన్ ఇండియా జానర్ ని కంటిన్యూ చేస్తూ , మల్టీ స్టారర్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగెర్ ఎన్టీఆర్ తో ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా సినిమాని తెరకెక్కించి ఇద్దరు స్టార్ హీరోస్ కు పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టారు .ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా హిట్ అందుకున్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆ తరువాత తాను చేయబోయే తరువాత సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేద్దాము అని డిసైడ్ అయ్యారు ,ఈ క్రమంలో ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ తో పొలిటికల్ జానర్ లో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే .ఈ సినిమా తరువాత రామ్ చరణ్ యంగ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపించాయి .

ఇక మెయిన్ మ్యాటర్ కి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం మెగా స్టార్ చిరంజీవి కథలు వింటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి , అయితే ఈ వార్తలు ఏమి కొత్త ఏమి కాదు ,రామ చరణ్ మొదటి సినిమా చిరుత కోసం కూడా మెగా స్టార్ స్టోరీ విని ఫైనలైజ్ చేసారు.ఇక ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ -స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 మూవీ తెరెకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే .అయితే ఈ సినిమా తరువాత చరణ్ అంగీకరిస్తే అతడితో ‘రంగస్థలం 2‘ తీయడానికి సుకుమార్ రెడీ ఉన్నారు ,ఇక అలాగే కన్నడ డైరెక్టర్ నర్తన్ కూడ ఒక డిఫెరెంట్ స్టోరీ డిఫెరెంట్ జానర్ ను రామ్ చరణ్ కు వినిపించి రామ చరణ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం రామ్ చరణ్ వీరిద్దరి సినిమా నిర్ణయాల్లో ఎవరికి ఒకే చెప్పాలి అనే డైలామాలో ఉన్నారు .ఈ పరిస్థితి ని గమనించిన చిరంజీవి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం మెగా స్టార్ వాల్తేరు వీరయ్య సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకొని ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు .అలానే ఓ పక్క తన దగ్గరకు వస్తున్న యంగ్ డైరేటర్స్ తో రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒక మంచి కథను సిద్ధం చేయమని చిరంజీవి ఆ దర్శకులను అడుగుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.ఇక లేటెస్ట్ గా డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చిరంజీవిని కలిసి ఒక కథ చెప్పినప్పుడు ఆకథ అంతా విన్న తరువాత తన నిర్ణయం చెప్పకుండా రామ్ చరణ్ కు కూడా ఒక కథ ఉంటే చెప్పమని అడిగినట్లు తెలుస్తోంది.అంతేకాదు చిరంజీవిని కలిసిన హరీష్ శంకర్ , డైరెక్టర్ నక్కిన త్రినాధ్ రావ్ రచయిత ప్రసన్న లతో కూడ ఇలాగే చరణ్ కోసం కథలు వ్రాయమని వారిని ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది.
