తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకరు.ఈయన నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
కేవలం చిరంజీవి కొడుకుగా మాత్రమే కాకుండా తనకంటూ ఎంతో గుర్తింపు సంపాదించుకొని తండ్రిని మించిన తనయుడు అనే పేరు ప్రఖ్యాతలు పొందారు.ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సంపాదించుకోవడమే కాకుండా ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.
ప్రస్తుతం రామ్ చరణ్ ( Ram Charan ) శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్నటువంటి గేమ్ చేంజర్ ( Game Changer ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రస్తుతం మైసూర్లో షూటింగ్ పనులు జరుపుకుంటుంది.ఇకపోతే మైసూర్లో ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నటువంటి రామ్ చరణ్ గత కొద్ది రోజుల క్రితం తనకు షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకడంతో వెంటనే మైసూర్లో (Mysore) ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న చాముండేశ్వరి ఆలయాన్ని( Chamundeswari Temple ) సందర్శించిన సంగతి మనకు తెలిసిందే.
రామ్ చరణ్ కు భక్తి భావం ఎక్కువ అనే విషయం మనకు తెలిసిందే ఈయన తరచూ గుళ్ళు గోపురాలు అంటూ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప మాల వేస్తూ తనలో ఉన్నటువంటి భక్తి భావాన్ని చాటుకుంటూ ఉంటారు.
ఈ క్రమంలోనే ఇటీవల మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్లినటువంటి రామ్ చరణ్ అక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు అయితే అమ్మవారిని నమస్కరిస్తూ హారతి పళ్లెంలో రామ్ చరణ్ వేసినటువంటి డబ్బు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social media ) చర్చలు జరుగుతున్నాయి.
కొన్ని వేల కోట్లకు వారసుడు అయినటువంటి రామ్ చరణ్ ఈ ఆలయంలో స్వామివారిని నమస్కరిస్తూ దక్షిణ పళ్లెంలో డబ్బు ఎంత వేశారు ఆయన రేంజ్ కు అనుగుణంగానే వేశారా అంటూ చర్చలు మొదలయ్యాయి అయితే స్వామివారి హారతి తీసుకుంటున్నటువంటి రామ్ చరణ్ కొన్ని 500 నోట్ల రూపాయలను హారతి పళ్లెంలో వేసి హారతి తీసుకోవడమే కాకుండా పండితులకు పాదాభివందనాలు కూడా చేశారు.
ఈ క్రమంలోనే కొందరు ఈ దక్షిణపై కూడా చర్చలు జరుపుతున్నారు అంత హోదా పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి ఈయన తన రేంజ్ కు అనుగుణంగానే స్వామి వారికి దక్షిణ చెల్లించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు మరికొందరు మాత్రం అదేంటి బాసు ఏకంగా అన్ని డబ్బులు వేశావు అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు రామ్ చరణ్ వేసినటువంటి ఈ డబ్బులు కనుక చూస్తే సుమారు 5 వేలకు ఏమాత్రం తక్కువగా ఉండవని తెలుస్తుంది.సాధారణంగా స్వామి వారికి కానుకల రూపంలో హుండీలోకి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తారు కానీ హారతి తీసుకునే సమయంలో ఏ వందనో ₹1000 ఇస్తారు అయితే రామ్ చరణ్ మాత్రమే 5000 వరకు డబ్బులు హారతి పళ్లెంలో వేయడంతో రామ్ చరణ్ ( Ram Charan ) మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఇక చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ దానిని ఇతరులకు పంచాలి అన్న పెద్ద మనసు ఉండదని అలాంటి మంచి మనసు ఉండడం గొప్ప అంటూ కొందరు కామెంట్స్ చేయగా, మరి కొందరు మాత్రం ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకునే రామ్ చరణ్ ఇంత తక్కువ మొత్తంలో దక్షిణ ఇవ్వాలా అంటూ కూడా కామెంట్లు చేయడం గమనార్హం.