మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా పాపులర్ అయ్యాడు.ఇటీవలే ఆస్కార్ (Oscar) ఈవెంట్ కోసం చరణ్ యూఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే.
మరి గత కొన్ని రోజులుగా ఇక్కడ నుండే చరణ్ పలు ఇంటర్వ్యూలు చేస్తూ సందడి చేస్తున్నాడు.ఇక తాజాగా చరణ్ ఆస్కార్ వేడుకకు హాజరయ్యే ముందు తండ్రి మెగాస్టార్ చిరంజీవిపై(Megastar Chiranjeevi) ఆసక్తికర కామెంట్స్ చేసాడు.
ఆస్కార్ వేడుకకు హాజరయ్యే ముందు చరణ్ మెగా ఫ్యాన్స్ కు ప్రత్యేకంగా ధన్యవాదములు చెబుతూ పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు.ఈయన మాట్లాడుతూ.”మెగా అభిమానుల ప్రేమాభిమానాల గురించి ఎంత చెప్పిన తక్కువే.అందుకే మిమ్మల్ని ఎప్పుడు నా గుండెల్లో పెట్టుకుంటాను.
మేము ఇలా ఉన్నామంటే మీ అందరి అభిమానమే కారణం.

తెలుగు వాళ్ళుగా మనం ఆర్ఆర్ఆర్ తో చరిత్ర సృష్టించాం.అందులో మీరంతా కూడా భాగమే.అలాగే నాన్నగారు తాజాగా వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయిన సందర్భంగా మీ అందరితో వీడియో కాల్ లో మాట్లాడారు.
ఆయనకు మాత్రమే ఇలాంటి ఐడియాలు వస్తాయి.మేము ఎంత అప్ డేట్ గా ఆలోచిస్తున్నాం అని అనుకున్న ఆయన మా కంటే ముందే అన్నిటిలోను ఉంటారు’ అంటూ చరణ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా చరణ్ సినిమాల విషయానికి వస్తే.ప్రెజెంట్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మరో సినిమాను అధికారికంగా ప్రకటించాడు.







