మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రెజెంట్ అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ‘RC15‘ సినిమా చేస్తున్నాడు.ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు గా నటించి పాన్ వరల్డ్ వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు.
ఈ క్రేజ్ ఇంకా పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.
ఇంత క్రేజ్ సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు చరణ్ చేయబోతున్న నెక్స్ట్ సినిమాపై మరిన్ని అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ప్రెజెంట్ చరణ్ చేస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకోగా 70 శాతం షూటింగ్ ముగిసింది.
అయితే ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ గురించి తాజాగా ఒక అప్డేట్ తెలుస్తుంది.

ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ను కర్నూల్ లోని కొండారెడ్డి బురుజులో ప్లాన్ చేసారు మేకర్స్.అయితే ఈ షెడ్యూల్ కొద్దీ రోజుల పాటు ఆగిపోయింది అని తెలుస్తుంది.వాయిదా పడిన ఈ షెడ్యూల్ ను తిరిగి కొనసాగించేందుకు మేకర్స్ మరొక ప్లాన్ చేస్తున్నారట.
మరి ఈ షెడ్యూల్ దేని కారణంగా వాయిదా పడిందో తెలియదు.ఇక ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.
మరి అనుకున్న సమయానికి ఈ సినిమా షూట్ పూర్తి అవుతుందో లేదో చూడాలి.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
చూడాలి ఈ సినిమాతో చెర్రీ విజయాన్ని కొనసాగిస్తాడో లేదో.







