రామ్ చరణ్ చెవిటి .. సమంత గుడ్డి

అయ్యా బాబోయ్ .మీరే గనుక రామ్ చరణ్ లేదా సమంత ఫ్యాన్ అయితే ఇలా హెడ్ లైన్ చూసిన వెంటనే మరో నిమిషం ఆలోచించకుండా మమ్మల్ని తిట్టేసుకోండి.

 Ram Charan Is Deaf And Samantha Is Blind-TeluguStop.com

వారిని ఆవమానించే ప్రయత్నం ఎంతమాత్రం చేయట్లేదు.నిజ జీవితంలో ఇద్దరు నిండూ ఆరోగ్యంతో ఎలాంటి లోపాలు లేకుండా ఉన్నారు.

వీరికి ఈ లోపాలు ఉండేది సినిమాలోనే.కథానాయకుడు, కథానాయికకి ఇలాంటి లోపలున్నాయంటేనే మీరు అర్థం చేసుకోవాలి, ఇలాంటి ఢిఫరెంట్ సినిమా తీసేది సుకుమార్ అని.

ఆయన దర్శకత్వంలోనే రామ్ చరణ్ హీరోగా, సమంత హీరోయిన్ గా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే.ఇంకా పేరు ఖరారు చేయని ఈ సినిమాలో రామ్ చరణ్ కి వినబడదు, సమంతకి ఏమి కనబడదు అంట.ఇలాంటి భిన్న ధృవాల నడుమ ప్రేమ ఎలా పుట్టింది, ఎటువంటి సవాళ్ళను ఎదుర్కొంది అనే విషయమే కథలో ఆసక్తికర అంశం.

ఈ పల్లెటూరి ప్రేమకథలో రాజకీయ అంశాలు కూడా ఉంటాయని, జగపతి బాబు, ఆది పినిశెట్టి పాత్రలు ప్రేక్షకులని థ్రిల్ చేస్తాయని టాక్.

మొత్తానికి చాలా బలమైన కథ కుదిరిందని, ఈ సినిమా చరణ్ కెరీర్ లో ఓ పెద్ద మైలురాయిగా నిలిచిపోనుందని మెగా సీనియర్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.మరి మాస్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ ని కొత్త పంథాలో తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

ఎన్టీఆర్ ఇమేజ్ ని ఎలాగైతే నాన్నకు ప్రేమతో మార్చేసిందో, ఇది కూడా అలాంటి చిత్రంగా నిలిస్తే రామ్ చరణ్ ప్రయత్నానికి మంచి ఫలితం దక్కినట్టే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube