కల్తీ బియ్యాన్ని పట్టుకున్న హీరో రామ్ చరణ్.. గేమ్ ఛేంజర్ లీక్స్ మామూలుగా లేవుగా!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ ( Ram Charan )ఏ సినిమాలో నటించినా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం కోసం ప్రాణం పెట్టి నటిస్తారనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్ ( game changer )సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం అంతాఇంతా కాదని తెలుస్తోంది.

 Ram Charan Game Changer Leaked Pic Goes Viral In Social Media Details Here , Ra-TeluguStop.com

రెండు షేడ్స్ ఉన్న రోల్స్ లో రామ్ చరణ్ ఈ సినిమాలో నటిస్తుండటం గమనార్హం.

అయితే ఈ సినిమాలోని సీన్ కు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూట్ భువనగిరి మండలంలోని భీమరావ్ పల్లెలో జరుగుతుండగా రామ్ చరణ్ పాత్ర కల్తీ బియ్యాన్ని పట్టుకునే సన్నివేశాన్ని షూట్ చేశారని తెలుస్తోంది.చరణ్ ఆఫీసర్ లుక్ లో ( Officer look )కనిపిస్తారని చరణ్ లుక్ అదుర్స్ అనిపించేలా ఉండనుందని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమాతో బాక్సాఫీస్ లెక్కల్లో కూడా చరణ్ గేమ్ ఛేంజర్ కానున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Crore Rupees, Dil Raju, Game Changer, Ram Charan, Tollywood-Movie

శంకర్ ఈ సినిమాలోని సాంగ్స్ కోసమే 90 కోట్ల రూపాయలు( 90 crore rupees ) ఖర్చు చేస్తున్నారు.ఖర్చు విషయంలో శంకర్ రాజీ పడటం లేదని ప్రతి సీన్ భారీ లెవెల్ లో ఉండనుందని సమాచారం.తెలుగు, తమిళ భాషల్లో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని భోగట్టా.

గేమ్ ఛేంజర్ సినిమాను పోటీ లేకుండా రిలీజ్ చేయాలని దిల్ రాజు( dil raju ) భావిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

Telugu Crore Rupees, Dil Raju, Game Changer, Ram Charan, Tollywood-Movie

తన సినీ కెరీర్ లోనే ఎక్కువ మొత్తం లాభాలను అందించిన సినిమాగా ఈ సినిమా నిలుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారని తెలుస్తోంది.గేమ్ ఛేంజర్ మూవీ లీక్డ్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ తో ఏ రేంజ్ సక్సెస్ ను అందుకుంటారో ఏ రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తారో చూడాలి.

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube