చరణ్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న జిగర్ తాండ మూవీ రిజల్ట్.. ఆ తప్పు చేస్తే ఇబ్బందేనంటూ?

కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన జిగర్ తాండ డబుల్ ఎక్స్ సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను నిరాశపరిచింది.

ఈ సినిమా భారీ నష్టాలను మిగల్చడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమాకు కథ అందించింది కూడా కార్తీక్ సుబ్బరాజు కావడంతో చరణ్ అభిమానులు ఒకింత టెన్షన్ పడుతున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమాలో పొలిటికల్ అంశాలను కూడా టచ్ చేయడంతో కార్తీక్ సుబ్బరాజ్( Karthik Subbaraj ) అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విషయంలో సక్సెస్ అవుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.కథ అందించింది కార్తీక్( Karthik Subbaraj ) అయినా స్క్రీన్ ప్లే అందించింది శంకర్ కావడంతో ఈ సినిమా విషయంలో టెన్షన్ అవసరం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.శంకర్ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో చూడాలి.

గేమ్ ఛేంజర్ సినిమా కథ, కథనం ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా ఉండాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.గేమ్ ఛేంజర్( Game Changer ) సినిమా కోసం మేకర్స్ ఏకంగా 300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేశారు.మరోవైపు దీపావళి కానుకగా రిలీజ్ కావాల్సిన జరగండి సాంగ్ రిలీజ్ వాయిదా పడింది.

Advertisement

ఆడియో రైట్స్ డాక్యుమెంటేషన్ సమస్య వల్ల ఈ సాంగ్ రిలీజ్ కావడం లేదని దిల్ రాజు చెప్పారు.గేమ్ ఛేంజర్ మేకర్స్ ఇచ్చిన క్లారిటీ నమ్మేలా లేదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ సినిమా భారీ హిట్ గా నిలుస్తుందని మెగా ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు.ఈ సినిమా 2024 సెకండాఫ్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది.గేమ్ ఛేంజర్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

సినిమా సినిమాకు రామ్ చరణ్ రేంజ్ పెరుగుతుండటం గమనార్హం.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు