టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ కు పాన్ ఇండియా హీరోగా ప్రత్యేక గుర్తింపు ఉండటంతో పాటు బాలీవుడ్, కోలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో చరణ్ కు పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.చరణ్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండగా సినిమాసినిమాకు నటుడిగా చరణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
చరణ్ భార్య ఉపాసన అపోలో హాస్పిటల్ కు సంబంధించిన విధులు నిర్వహించడంతో పాటు పలు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా రామ్ చరణ్ ఉపాసనపై తన ప్రేమను వ్యక్తం చేశారు.
నిన్న ఉపాసన పుట్టినరోజు కాగా రామ్ చరణ్ నా ప్రియమైన ఉపాసన.పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చెప్పుకొచ్చారు.
ఉపాసనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చరణ్ ఆమెపై ప్రేమను చూపించిన విధానానికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.చరణ్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి కూడా బాగానే ప్రాధాన్యత ఇస్తున్నారు.
చరణ్ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తల్లీదండ్రులు, భార్యతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపగా చరణ్ పోస్ట్ కు ఏకంగా 4 లక్షలకు పైగా లైక్స్ రావడం గమనార్హం.

మరోవైపు చరణ్ శంకర్ మూవీ షూట్ అంతకంతకూ ఆలస్యమవుతున్నా చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా చరణ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందని కాన్ఫిడెన్స్ తో ఉండటం గమనార్హం.

సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ కానున్నాయి.ఆర్ఆర్ఆర్ మూవీతో చరణ్ ఖాతాలో తొలి పాన్ ఇండియా హిట్ చేరగా ఈ సినిమాతో మరో పాన్ ఇండియా హిట్ చేరే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.







