మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan ) గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్న తర్వాత తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకున్నాడు.ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో ”గేమ్ ఛేంజర్”( Game Changer ) ఒకటి.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ప్రస్తుతం తన 15వ సినిమాగా చేస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు.
కానీ ఎలాంటి అప్డేట్స్ శంకర్( Director Shankar ) ఇవ్వక పోవడంతో ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు.ఈ దసరా కానుకగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఇస్తామని దీపావళికి రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చారు.
కానీ ఇది కూడా మళ్ళీ వాయిదా వేసి ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేసారు.దీంతో మరింత కోపంగా ఉన్నారు.

ఇక ఇప్పుడు మేకర్స్ ఆ కోపాన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.మరి మైసూర్ లో జరుగుతున్న ఈ షూట్ కోసం రామ్ చరణ్ ప్రత్యేక ఫ్లైట్ లో అక్కడికి చేరుకున్న విజువల్స్ షేర్ చేసారు.ఈ వీడియోలో చరణ్ డాషింగ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఈ సినిమా ఈయన బ్యానర్ లో 50వ సినిమా కావడంతో ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నారు.ఇక బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎప్పుడు షూట్ పూర్తి చేసుకుని ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.







