మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాలున్న ఈ సినిమాను వచ్చే నెల సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు.
ఎన్టీఆర్ కూడా ఈ సినిమా లో మరో హీరోగా నటించాడు.రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని అంటున్నారు.ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.
కాని రామ్ చరణ్ మాత్రం తన తదుపరి సినిమా షూటింగ్ ప్రారంభించాడు.దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు సిద్దం అయ్యాడు.
భారీ అంచనాల నడుమ ఇప్పటికే సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.మొదటి షెడ్యూల్ ను పుణె లో నిర్వహించగా , డిసెంబర్ మొదటి వారంలో రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ముగించారు.

ఇక మూడవ షెడ్యూల్ ను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్‌ఆర్ సినిమా ప్రమోషన్ కోసం ఆరు వారాల సమయం ను రాజమౌళి ఇద్దరు హీరోల నుండి కోరినట్లుగా తెలుస్తోంది.అందుకే రామ్ చరణ్ సినిమా చిత్రీకరణ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంది.సంక్రాంతి తర్వాత వారం శంకర్ సినిమా పునః ప్రారంభం అవుతుందని అంటున్నారు.వచ్చే ఏడాది దసరా వరకు సినిమా చిత్రీకరణ పూర్తి చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.సినిమాను 2023 లో విడుదల చేస్తారు.
వచ్చే ఏడాది చివరి వరకు రామ్ చరణ్ కొత్త సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.మొత్తానికి ఒక మంచి సినిమాను శంకర్ దర్శశకత్వంలో రామ్ చరణ్ చేస్తున్నాడనే నమ్మకం అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.