'ఆచార్య' లో సిద్దా నీలాంబరి ఉండేది ఎంత సేపు తెలుసా?

మెగా స్టార్‌ చిరంజీవి ఆచార్య సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.ఈ ఏడాది మే నెలలోనే విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా ఆలస్యం అయిన విషయం తెల్సిందే.

 Ram Charan And Pooja Hegde Run Time In Acharaya Movie, Ram Charan , Pooja Hegd ,-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఆచార్య సినిమా లో రామ్ చరణ్‌ ఉండటం వల్ల అంచనాలు మరింతగా పెరిగాయి.ఇక రామ్‌ చరణ్ కు జోడీగా ఈ సినిమా లో టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే నటించింది.

వీరిద్దరి పాత్రలో అలా వచ్చి ఇలా వెళ్తాయని మొదట అంతా అనుకున్నారు.కాని తాజాగా నీలాంబరి అంటూ వచ్చిన పాట వీరిద్దరి మద్య చాలా కథ జరుగుతుంది.

అది ఆచార్యలో మనం చూడబోతున్నాం అంటూ అభిమానులు అనుకుంటున్నారు.ఇంతకు ఆచార్య సినిమా లో నీలాంబరి మరియు సిద్దాలు ఉండేది ఎంత సమయం అనేది ఒక క్లారిటీ ఇవ్వడం కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు అనధికారికంగా ఒక లీక్ ఇవ్వడం జరిగింది.

ఆచార్య సినిమాలో వీరిద్దరి స్క్రీన్‌ రన్ టైమ్ చాలానే ఉంటుందట.రామ్ చరణ్‌ స్క్రీన్‌ అప్పియరెన్స్ దాదాపుగా 35 నుండి 40 నిమిషాల పాటు ఉంటుందట.ఇక పూజా హెగ్డే స్క్రీన్‌ అప్పియనెన్స్ 15 నుండి 20 నిమిషాలు ఉంటుందట.కథలో వీరి పాత్రలు చాలా కీలకంగా ఉంటాయని అంటున్నారు.

రామ్‌ చరణ్‌ మరియు చిరంజీవిల కాంబోలో వచ్చే సన్నివేశాలు అభిమానులతో పాటు అందరికి కూడా వెంట్రుకలు నిక్క పొడ్చుకునేలా ఉంటాయని అంటున్నారు.

Telugu Acharaya, Neelambari, Pooja Hegde, Ram Charan, Tollywood-Movie

ఆహా ఓహో అన్నట్లుగా సిద్దా మరియు నీలాంబరి అదే చరణ్ మరియు పూజాల ప్రేమ కథ ఉంటుందని అంటున్నారు.టెంపుల్ సిటీలోనే మెజార్టీ షూటింగ్‌ ను వీళ్లపై చిత్రీకరించారు.కొద్ది పాత్ర అయినా కూడా పూజా హెగ్డే ఈ సినిమా కోసం దాదాపుగా 50 లక్షల పారితోషికంను అందుకుందని అంటున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఆచార్య సినిమా తో పూజా హెగ్డే ఆకట్టుకునే విధంగా లుక్ ఉంది.లంగా వోణి.చీర మొత్తానికి పూజా ఒక పద్దతైన పాత్రలో కనిపించబోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube