ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఎట్టకేలకు స్కంద సినిమా తో డీసెంట్ కలెక్షన్స్ ని దక్కించుకున్నాడు.ఈ మధ్య కాలంలో ఈయన నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉన్నాయి.
దాంతో తల పట్టుకున్న రామ్ తాజా చిత్రం స్కంద( Skanda movie ) పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.స్కంద సినిమా కు నెగటివ్ టాక్ వచ్చినా కూడా వసూళ్ల పరంగా చూస్తూ పర్వాలేదు అన్నట్లుగా ఉన్నాయి.

బోయపాటి మ్యాజిక్ చేయకున్నా కూడా శ్రీలీల( Sreeleela ) క్రేజ్ కారణంగా భారీ గా వసూళ్లు నమోదు అవుతున్నాయి అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రస్తుతం స్కంద సినిమాకు సంబంధించిన వసూళ్లు, అందుకు కారణం అయిన శ్రీలీల అంటూ తెగ చర్చ జరుగుతోంది.అదుగో ఇదుగో అంటూ స్కంద సినిమా గురించి పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు వస్తున్నాయి.ఇదే సమయంలో మీడియా లో శ్రీలీల వల్లే రామ్ కి సక్సెస్ దక్కింది.బోయపాటి కూడా బాలయ్య తో మాత్రమే సినిమాలు తీయాలి, ఆయన తో మాత్రమే సక్సెస్ లు దక్కించుకుంటాడు అనుకుంటూ ఉంటే ఇదే సమయంలో స్కంద సినిమా ను రామ్ తో తీసి కూడా రూ.50 కోట్ల వసూళ్లు సాధించడం అంటే గొప్ప విషయం అన్నట్లుగా మీడియా సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు.

వరుస ఫ్లాప్స్ లో ఉన్న రామ్ కి మరియు బోయపాటి బ్యాడ్ సెంటిమెంట్ కి శ్రీలీల చెక్ పెట్టినట్లు అయింది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇందుకే శ్రీలీల కి టాలీవుడ్ లో పదికి పైగా ఆఫర్లు వచ్చాయి అంటున్నారు.ఈ రేంజ్ లో సినిమా లు సక్సెస్ అవ్వడం వల్లే ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.మీడియా లో స్కంద సక్సెస్ లో ఎక్కువ శాతం క్రెడిట్ ను శ్రీలీలకు ఇవ్వడం చూస్తూ ఉంటే ఆమెకు మరిన్ని సినిమా ల్లో ఆఫర్లు దక్కే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
ముందు ముందు భారీ ఎత్తున పారితోషికం కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి.







