విశాఖ రాజధానిగా కోరుతూ ఉమ్మడి విశాఖ జిల్లాల్లోనీ పలు నియోజకవర్గాల్లో ర్యాలీలు మానవహారాలు జరుపుతున్నారు.చోడవరం నియోజకవర్గంలో తాజాగా ప్రజలు పెద్ద ఎత్తున విశాఖ రాజధానికి మద్దతుగా కదం తొక్కారు.
భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.మానవహారంగా ఏర్పడి విశాఖ ను రాజధాని చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.ఇటీవలెనే విశాఖ రాజధానికి మద్దతుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన రాజీనామా పత్రాన్ని జేఏసీ నేతలక అందించారు.