సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్( Rakul Preet Singh ) .ఈమె వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు.
అనంతరం తెలుగులో అలాగే తమిళంలో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.అయితే ఈమె ఎప్పుడైతే డ్రగ్స్( Drugs ) వివాదంలో చిక్కుకున్నారో అప్పటినుంచి తెలుగులో అవకాశాలను కోల్పోతూ వచ్చారు.
ఇలా తెలుగులో అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ పై ఫోకస్ పెట్టిన రకుల్ ప్రస్తుతం అక్కడే సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేపోటిజం( Nepotism ) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇండస్ట్రీలో హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.మరోవైపు నెపోటిజం కూడా ఇండస్ట్రీలో ఉంది.
చాలామంది ఈ నెపోటిజంపై విమర్శలు చేయగా మరికొందరు మాత్రం టాలెంట్ ఉంటేనే ఎవరికైనా అవకాశాలు వస్తాయని ఎంత సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా టాలెంట్ లేకపోతే వేస్ట్ అంటూ సమర్పిస్తూ వస్తున్నారు.
ఈ సందర్భంగా రకుల్ సైతం నెపోటిజం గురించి మాట్లాడుతూ.ఇండస్ట్రీలో నెపోటిజం ఉందనే మాట వాస్తవమే అయితే ఈ నెపోటిజం కారణంగా తాను కెరియర్ మొదట్లో ఎన్నో అవకాశాలను కోల్పోయానని ఈమె తెలిపారు.అయితే ఎప్పుడూ కూడా అవకాశాలను కోల్పోయానని నేను బాధపడలేదు తన స్వసక్తితో అవకాశాలను అందుకున్నానని, జీవితంలో ఇలా ఎన్నో అవకాశాలను కోల్పోవలసి వస్తుందని తెలిపారు.
ఇక ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ కి వచ్చిన అన్ని అవకాశాలు ఇతరులకు రావు అంటూ నెపోటిజం పట్ల ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.