టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక రక్షిత్ శెట్టి( Rakshit shetty ) తో కొంతకాలం పాటు ప్రేమలో ఉండి నిశ్చితార్థం కూడా జరుపుకుని కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.రక్షిత్ శెట్టి గురించి మాట్లాడటానికి సైతం రష్మిక పెద్దగా ఇష్టపడరు.
ప్రస్తుతం రష్మిక ( Rashmika Mandanna )కన్నడ ఇండస్ట్రీ కంటే తెలుగు, ఇతర భాషల సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.అయితే రష్మికతో పెళ్లి ఆగిపోవడం గురించి రక్షిత్ మరోసారి కామెంట్లు చేశారు.
రష్మికతో పెళ్లి ఆగితే ఏంటని తాను, రష్మిక ఇప్పటికీ టచ్ లో ఉన్నామని రక్షిత్ చెప్పుకొచ్చారు.రష్మికకు లైఫ్ లో పెద్ద డ్రీమ్ ఉండేదని ఇప్పుడు దాన్ని సాకారం చేసుకుందని రక్షిత్ అన్నారు.
రష్మిక ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ జాబితాలో చేరడంతో రక్షిత్ శెట్టి ఈ కామెంట్లు చేశారు.రష్మిక ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
రష్మిక పారితోషికం ప్రస్తుతం 3 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.

రష్మిక రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లకు ప్రాధాన్యత ఇస్తున్న రష్మిక ది గర్ల్ ఫ్రెండ్( The Girl friend ) అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుండగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.రష్మికకు మరిన్ని విజయాలు దక్కాలని కొంతమంది ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రష్మిక ఇతర భాషల్లో కూడా మరింత సత్తా చాటాల్సిన అవసరం అయితే ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.రష్మిక సినిమా సినిమాకు విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు.రష్మిక విజయ్ దేవరకొండ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఏం జరుగుతుందో చూడాలి.రష్మికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.







