Karthi : హీరో కార్తీ కి కోటి రూపాయల చెక్ ఇచ్చిన ఉదయ్ నిధి ..ఎందుకంటే?

దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) నూతన భవన నిర్మాణం చేపట్టాలని పెద్ద ఎత్తున హీరో విశాల్( Vishal ) నిధులను సమకూరుస్తున్న సంగతి తెలిసిందే.2019 వ సంవత్సరంలో నడిగర్ సంఘం ఎన్నికలు జరగగా 2022వ సంవత్సరంలో ఫలితాలను వెల్లడించారు.ఈ సంఘం అధ్యక్షుడిగా నాజర్ జనరల్ సెక్రెటరీగా విశాల్, ట్రెజరర్ గా హీరో కార్తీ( Karthi ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే ఈ అసోసియేషన్ భవనం నిర్మించడం కోసం పెద్ద ఎత్తున నిధుల కొరత ఏర్పడిందని గతంలో విశాల్ తెలిపారు.

 Hero Uday Nidhi Donates One Crore For Nadigar Building-TeluguStop.com

ఇక ఈ భవనం నిర్మించడం కోసం నిధులను సమ కూర్చో పనిలో ఉన్నారు.

గత మూడు సంవత్సరాల నుంచి ఈ భవనం నిర్మించడానికి ఆలస్యమవుతున్నటువంటి తరుణంలో 25% పనులు కూడా పెరిగాయని అదేవిధంగా డబ్బు కూడా ఎక్కువ అవుతుందని తెలిపారు.ఇక ఈ భవనం నిర్మించడం కోసం బ్యాంకులో రుణం కూడా తీసుకోబోతున్నాము అంటూ ఓ సందర్భంలో విశాల్ ( Vishal) వెల్లడించారు.ఇలా ఈ భవన నిర్మాణం పూర్తి చేయాలని పెద్ద ఎత్తున నడిగర్ సంఘం ( Nadighar Sangham ) సభ్యులు కష్టపడుతున్నటువంటి తరుణంలో వారికి అండగా సినీ నటుడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అండగా నిలిచారు.

భవన నిర్మాణం పూర్తి చేయాలని ఉదయ నిది స్టాలిన్ ( Udaynidhi stalin )ట్రెజరర్ గా ఉన్నటువంటి హీరో కార్తీ కు ఏకంగా కోటి రూపాయల చెక్ అందించారు.ఈ విధంగా ఉదయ నిది స్టాలిన్ కోటి రూపాయల చెక్క అందించడంతో ఈ విషయాన్ని విశాల్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తనకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రియమైన ఉదయ్ ఈ భవన నిర్మాణం కోసం ఇలా కోటి రూపాయలు సహాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు సహ నటుడిగా నిర్మాతగా స్నేహితుడిగా క్రీడా మంత్రిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube