అల్లు అర్జున్ ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్... ఫోటోలు వైరల్!

దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల పండుగలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు.అయితే నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా తమ సోదరులకు రాఖీలు కట్టి వారు క్షేమంగా ఉండాలని జీవితంలో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ తమ సోదరులకు రాఖీలు కడుతూ రాఖీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

 Rakhi Celebrations At Allu Arjuns House Photos Viral , Rakhi Celebration, Allu-TeluguStop.com

ఈ విధంగా సాధారణ ప్రజలను నుంచి మొదలుకొని స్టార్ సెలబ్రిటీలందరూ కూడా ఈ రాఖీ పండుగ ( Rakhi Celebration )సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు.ఇక సినీ సెలబ్రిటీలో సైతం ఎంతో ఘనంగా రాఖీ పండుగను జరుపుకోవడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉన్నారు.

Telugu Allu Arha, Allu Arjun, Allu Ayan, Pushpa, Rakhi, Sneha Reddy, Tollywood-M

ఈ క్రమంలోనే సెలబ్రిటీల ఫ్యామిలీలలో అల్లు అర్జున్ ఫ్యామిలీ( Allu Arjun Family )లో ముందుగా రాఖీ పండుగ సెలబ్రేషన్స్ జరిగాయని తెలుస్తుంది.అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ( Allu Arha )తన అన్నయ్య అల్లు అయాన్( Allu Ayan ) కి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ విధంగా తనకు రాఖీ కట్టడంతో సైతం తన చెల్లెకి బోలెడు గిఫ్ట్స్ ఇచ్చారని తెలుస్తోంది.ఇక అర్హ అయాన్ కి మాత్రమే కాకుండా స్నేహ రెడ్డి (Sneha Reddy )చెల్లెలు పిల్లలకి కూడా ఈమె రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ రాఖీ సెలబ్రేషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ కూడా బాగమయ్యారని తెలుస్తుంది.

Telugu Allu Arha, Allu Arjun, Allu Ayan, Pushpa, Rakhi, Sneha Reddy, Tollywood-M

అల్లు అర్జున్ కు సొంతంగా సిస్టర్స్ ఎవరు లేరు.అయితే అల్లు అర్జున్ కజిన్ సిస్టర్ అల్లు అర్జున్ కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఇక స్నేహ రెడ్డి ఈ రాఖీ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అయ్యాయి.

ఈ ఫోటోలు వైరల్ కావడంతో పలువురు రాఖీ శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఇకపోతే గత కొద్దిరోజులుగా అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్న సంగతి మనకు తెలిసిందే.

అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని నటనకు గాను ఏకంగా జాతీయ అవార్డు అందుకోవడంతో ఈయన పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube