రాజన్న సిరిసిల్ల జిల్లా: అన్నదమ్ములు అక్కా చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీకగా నిలుస్తున్న రాఖీ పండుగ వేడుకలను ఎల్లారెడ్డి పేట మేజర్ గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత బాలరాజు యాదవ్ ల కూతురు ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న ఒగ్గు శ్రీనిధి యాదవ్ ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి కి,

ఎల్లారెడ్డిపేట ఎస్.ఐ రమాకాంత్ తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బందికి రక్షా బంధన్ పండగ పురస్కరించుకుని వారికి రాఖీల ను కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎల్లారెడ్డి పేట సీఐ శశిధర్ రెడ్డి, ఎస్.ఐ రమాకాంత్ లు ఉన్నత చదువులు చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని ఒగ్గు శ్రీనిధి యాదవ్ ను వారు ఆశీర్వదించారు.







