కృష్ణయ్య కు రాజ్యసభ ! జగన్ అసలు వ్యూహం ఇదా ?

ఎవరూ ఊహించని విధంగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కు జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.ఈ వ్యవహారం పార్టీలోని నాయకులు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.  రాజ్యసభ సభ్యత్వం దక్కించుకునేందుకు పార్టీలోని చాలామంది నాయకులే… చాలాకాలంగా ఎదురు చూపులు చూస్తూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

 Rajya Sabha To Krishnaiah! Is This The Real Strategy Of Jagan R Krishnayya, Bc W-TeluguStop.com

జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇస్తానని హామీ ఇవ్వడం, అలాగే 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కని కొంతమందికి రాజ్యసభ హామీని జగన్ ఇచ్చారు.వీరంతా తమకు ఎప్పుడు అవకాస్తుందా అని ఎదురు చూపులు చూస్తూ ఉండగా , టిడిపి నుంచి వైసీపీలో చేరిన బీద మస్తాన్ రావు కు, జగన్ కేసులు వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి కి, విజయసాయిరెడ్డికి కి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కు జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.
      మిగతా నాయకుల వ్యవహారాల కంటే, తెలంగాణ కు చెందిన ఆర్.కృష్ణయ్య కు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం పైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.అసలు ఆర్.కృష్ణయ్య వైపు జగన్ ఎందుకు మొగ్గు చూపించారు అనే విషయాన్ని పార్టీ నాయకులు ఆరా తీస్తున్నారు.2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో అఖండ మెజారిటీ దక్కించుకుంది.ప్రస్తుతం రాజకీయంగా వైసీపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.2019 ఎన్నికల ముందు వరకు టిడిపికి అండగా నిలిచిన బీసీ సామాజిక వర్గాలు 2019 ఎన్నికల్లో వైసిపికి అనుకూలంగా వ్యవహరించడంతో ఈ స్థాయిలో ఆ పార్టీకి విజయం దక్కింది.కానీ ఇప్పుడు పరిస్థితి వేరేగా ఉంది.బీసీలకు వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నామినేటెడ్ పదవులు కట్టబెట్టినా.ఏదో తెలియని అసంతృప్తి బీసీ సామాజిక వర్గం లో నెలకొనడం, టిడిపి వైపు వారంతా మొగ్గు చూపిస్తూ ఉండడంతో, బీసీ సామాజిక వర్గాలను పూర్తిగా తమవైపు తిప్పుకునేందుకు 2024 ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు టిడిపి వైపు వెళ్లకుండా చేసేందుకు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య జగన్ రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
   

Telugu Ap Cm Jagan, Ap, Bcsankahema, Bc Welfare, Krishnayya, Rajyasabha, Ysrcp-T

  రాష్ట్ర జనాభాలో 49.55 శాతం ఉన్న బిసిల ఓట్లు వైసీపీకి ఎంతో కీలకం.అందుకే తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్య జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు.ఈయన గతంలో తెలంగాణ టిడిపి తరఫున సీఎం అభ్యర్థిగా ఎన్నికల్లోనూ పోటీ చేసి ఓటమి చెందారు.

ఇప్పుడు వైసిపి సభ్యత్వం లేకపోయినా,  జగన్ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలి అనుకోవడానికి కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube