బాలయ్యతో థమన్ సెల్ఫీ.. స్టైలిష్ లుక్ లో నటసింహం.. పిక్ వైరల్!

నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో సూపర్ హిట్ అందుకుని భారీ వసూళ్లు కూడా రాబట్టింది.చాలా రోజుల తర్వాత బాలయ్యకు ఇటు బోయపాటి కి మంచి విజయం దక్కడంతో ఆనందంగా ఉన్నారు.

 Balakrishna S Pic From The Sets Of Nbk 107 Goes Viral , Nbk107 , Nandamuri Balak-TeluguStop.com

ఇదే ఖుషీలో బాలయ్య తన తర్వాత సినిమా కూడా స్టార్ట్ చేసారు.యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 వ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.

గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా ఎలా ఉండ బోతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ సిరిసిల్ల ప్రాంతంలో పూర్తి చేసుకుంది.తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలో స్టార్ట్ చేసారు.ఇక్కడికి వచ్చిన తర్వాత డైరెక్టర్ గోపీచంద్ శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక యథార్థ సంఘటన ఆధారంగా చేసుకుని గోపీచంద్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి థమన్ షేర్ చేసిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.

Telugu Nbk, Shared Thaman, Thaman, Shruti Haasan-Movie

ఈ సినిమాకు థమన్ అందించిన ఒక మాస్ పాటకు బాలకృష్ణ మాస్ స్టెప్పులు వేశారు.ఈ పాట మేకింగ్ సమయంలో థమన్ తీసుకున్న ఒక సెల్ఫీ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఈ ఫొటోలో బాలయ్య స్టైలిష్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టు కుంటుంది.

ఈయన మరింత యంగ్ గా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ నందమూరి ఫ్యాన్స్ ను మరింత ఆకట్టు కుంటున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం విదితమే.

అలాగే కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube