అధికార వైసీపీలో ఎంతోమంది ఆశావహులు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.ఎన్నికలకు ముందు జగన్ చాలామందికి హామీలు ఇచ్చారు.
ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని అనేక మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానంటూ హామీలు గుప్పించారు.అలాంటి వారిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మర్రి రాజశేఖర్ కూడా ఉన్నారు.
గత ఎన్నికల్లో విడుదల రజినీ కోసం తన ఎమ్మెల్యే టికెట్‌ను వదులుకున్నారు.కాగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని జగన్ అప్పుడే హామీ ఇచ్చారు.
అయితే ఆ తర్వాత మాత్రం చాలా సార్లు హ్యాండ్ ఇచ్చారు.
ఇప్పటికే చాలా సార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి వెళ్లాయి.
కానీ ప్రతిసారి ఆయనకు పదవి వస్తుందనే ప్రచారం తప్ప.ఒరిగిందేమీ లేదు.
కేబినెట్ లోకి కూడా తీసుకునే ఉద్ధేశం జగన్‌కు లేదని స్పష్టంగా అర్థం అవుతోంది.నిజానికి వైసీపీ గెలుపులో మర్రి రాజశేఖర్ ఎంతో కీలకంగా వ్యవహరించారు.
కమ్మ సామాజిక వర్గం ఓట్లు వైసీపీకి రావడంలో ఆయన కూడా కీలకంగా వ్యవహరించారు.అయితే ఇప్పుడు టీడీపీ మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మళ్లీ కమ్మ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నారంట.
ఇందులో భాగంగానే ఇప్పుడు మరో మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.మర్రి రాజశేఖర్‌కు త్వరలోనే రాజ్యసభ టికెట్ ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది.ఇప్పుడు వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన వారిలో ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న వారే ఉన్నారు.కాబట్టి కమ్మ నేతలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పుకోవడానికి రాజశేఖర్‌కు ఆ పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నారంట.
గుంటూరుతో పాటు కృష్ణా జిల్లాల్లో కమ్మల బలంగా చాలా ఉంది.కాబట్టి ఇప్పుడు వారిని వైసీపీ వైపు మళ్లించుకునేందుకు ఇలాంటి ప్లాన్ వేశారంట.