ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి.ఈ క్రమంలో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది.
అయితే వారం రోజులుగా విపక్ష సభ్యులు మణిపూర్ అంశంపై చర్చకు నోటీసులు ఇస్తున్నారని రాజ్యసభ ఛైర్మన్ తెలిపారు.కాగా ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ నేపథ్యంలో మణిపూర్ పరిస్థితులపై సభ్యులు చర్చలో పాల్గొనాలని సూచించారు.రూల్ 267 కింద పదే పదే నోటీసులు ఇస్తున్నారని జగదీప్ ధన్కడ్ అన్నారు.
మరోవైపు ఇవాళ రాజ్యసభ ఛైర్మన్ ప్రసంగానికి టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్ అడ్డుతగిలారు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాజ్యసభ ఛైర్మన్ బల్లలు చరిచి మాట్లాడొద్దని సూచించారు.