''తలైవర్171'లో ఆ స్టార్ హీరో.. లోకేష్ ప్లాన్ అదిరిందిగా!

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) ఒకప్పుడు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే సుపరిచితం.కానీ ఇప్పుడు అలా కాదు.

 Rajinikanth's Lokesh Kanagaraj Movie Thalaivar 171 Update, Rajinikanth, Lokesh K-TeluguStop.com

కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసిన తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగింది.ఇక ఈ సినిమా తర్వాత చేస్తున్న సినిమాలను తన యూనివర్స్ లో భాగం చేస్తూ వస్తున్నాడు.

లోకేష్ ఇటీవలే తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసిన విషయం తెలిసిందే.ఎప్పటి నుండో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఒక సినిమా చేయనున్నాడు అంటూ రూమర్స్ రాగా ఈ రూమర్స్ నిజమనేలా అఫిషియల్ అప్డేట్ వచ్చింది.సూపర్ స్టార్ ‘‘తలైవర్ 171”వ సినిమాను లోకేష్ డైరెక్ట్ చేయబోతున్నాడు.

ఈ కాంబో అలా ప్రకటించగానే కోలీవుడ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అయ్యింది.

ఇందులో ఎప్పటి నుండో మరో హీరో ఉన్నాడంటూ తరచు వార్తలు వస్తూనే ఉన్నాయి.ఇక తాజాగా ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోస్ లో ఒకరైన శివకార్తికేయన్ నటిస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఇది నిజమే అయితే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.కాగా ఈ ప్రాజెక్ట్ కు అనిరుద్ రవిచంద్రన్(<Anirudh Ravichander ) మ్యూజిక్ అందించనున్నారు.

ఇక సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube