”తలైవర్171’లో ఆ స్టార్ హీరో.. లోకేష్ ప్లాన్ అదిరిందిగా!

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) ఒకప్పుడు కేవలం కోలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే సుపరిచితం.

కానీ ఇప్పుడు అలా కాదు.కమల్ హాసన్ తో విక్రమ్ సినిమా తీసిన తర్వాత ఈయన క్రేజ్ అమాంతం పెరిగింది.

ఇక ఈ సినిమా తర్వాత చేస్తున్న సినిమాలను తన యూనివర్స్ లో భాగం చేస్తూ వస్తున్నాడు.

"""/" / లోకేష్ ఇటీవలే తన కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేసిన విషయం తెలిసిందే.

ఎప్పటి నుండో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్( Rajinikanth ) ఒక సినిమా చేయనున్నాడు అంటూ రూమర్స్ రాగా ఈ రూమర్స్ నిజమనేలా అఫిషియల్ అప్డేట్ వచ్చింది.

సూపర్ స్టార్ ''తలైవర్ 171''వ సినిమాను లోకేష్ డైరెక్ట్ చేయబోతున్నాడు. """/" / ఈ కాంబో అలా ప్రకటించగానే కోలీవుడ్ లో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి ఏదొక అప్డేట్ వస్తూనే ఉంది.ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ బజ్ వైరల్ అయ్యింది.

ఇందులో ఎప్పటి నుండో మరో హీరో ఉన్నాడంటూ తరచు వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఇక తాజాగా ఈ సినిమాలో కోలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోస్ లో ఒకరైన శివకార్తికేయన్ నటిస్తున్నట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఇది నిజమే అయితే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.

కాగా ఈ ప్రాజెక్ట్ కు అనిరుద్ రవిచంద్రన్(<Anirudh Ravichander ) మ్యూజిక్ అందించనున్నారు.

ఇక సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనున్నారు.

బెట్టింగ్ యాప్స్ ను ఎందుకు బ్యాన్ చేయలేకపోతున్నారు.. హర్ష సాయి