ఆర్ఆర్ఆర్ తో పోలిస్తే గత 22 ఏళ్లుగా చెక్కుచెదరని రజనీకాంత్ రికార్డు

ఆర్ఆర్ఆర్ సినిమా మన దేశంతో పాటు జపాన్ వంటి దేశాల్లో కూడా బాగా కలెక్షన్స్ వర్షం కురిపించింది.రష్యాలో సైతం బాగా వసూళ్ల కురిపించడంతో ఏ సినిమా పాన్ ఇండియా చిత్రంగా కాకుండా పాన్ వరల్డ్ చిత్రంగా మారింది.

 Rajinikanth Record In Japan Details, Rajnikanth, Japan, Rajnikanth Japan Record,-TeluguStop.com

ఇక తెలుగు వారి తో పాటు యావత్ భారతదేశం మొత్తం కూడా ఆర్ఆర్అర్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు ఆస్కార్ లో నామినేషన్ దక్కించుకోవడంతో ఇప్పటికీ ఆ సినిమా గురించే ప్రతి చోట చేర్చ సాగుతోంది.

ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే అయినా ఇప్పుడు జపాన్ లేదా రష్యా వంటి దేశాలలో మన సినిమా కలెక్షన్స్ సాధించడం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం.కానీ గత 22 ఏళ్లుగా రజినీకాంత్ ఇలాంటి సునామీనే సృష్టిస్తూ వస్తున్నాడు జపాన్ లో. ఆయన తీసే ప్రతి సినిమా కూడా జపాన్ దేశంలో విడుదలవుతుంది.అక్కడ రికార్డ్స్ కొల్లబడుతూనే ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పాటు చేసుకున్నారు రజినీకాంత్.

Telugu Rajamouli, Japan, Ntr, Pushpa, Rajinikanth, Rajnikanth, Ram Charan, Rajin

ఇలాంటి ఘనత సాధించిన హీరోలలో మన దేశం నుంచి రజినీకాంత్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు.ఆయన సినిమాలు అక్కడ భాష వారు ఎగబడి మరీ రజినీ కాంత్ కొనుక్కొని రీమేక్ చేసుకోవడం లేదా డబ్ చేసుకోవడం కూడా చేస్తూ ఉంటారు.కానీ ఇప్పుడు వస్తున్న సినిమాలకు రజనీకాంత్ సినిమాలకు చాలా తేడా ఉంది.ఇప్పుడు పక్క దేశంలో మన సినిమా వాళ్లు ఒక చిత్రాన్ని విడుదల చేయాలంటే భారీగా ఖర్చు పెడుతున్నారు.

Telugu Rajamouli, Japan, Ntr, Pushpa, Rajinikanth, Rajnikanth, Ram Charan, Rajin

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి విదేశాల్లో విడుదల చేసి ఆస్కార్ కి పంపించాడు రాజమౌళి. ఇక పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పుష్ప సినిమా కూడా రాజమౌళి చిత్రం లాగే కలెక్షన్స్ సాధిస్తుంది అని నమ్మి అంత ఖర్చుపెట్టిన అక్కడ చూసేవాళ్లే కరువయ్యారు.కానీ రజనీకాంత్ సినిమా జపాన్ లో విడుదల అయ్యిందంటే పెట్టే ఖర్చు కన్నా వచ్చే కలెక్షన్స్ ఎక్కువ శాతం ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube