సూపర్ స్టార్ రజినికాంత్( Rajinikanth ) లీడ్ రోల్ లో నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilip Kumar ) డైరెక్షన్ లో వస్తున్న సినిమా జైలర్.ఈ సినిమాలో తమన్నా, ప్రియంక అరుల్ మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
సినిమాలో స్పెషల్ అప్పియరెన్స్ గా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు.అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచారు.

రజిని సినిమా అంటే తెలుగులో కూడా భారీ రిలీజ్ ఉంటుంది.కానీ జైలర్ సినిమా విషయంలో మాత్రం లైట్ తీసుకున్నారని అనిపిస్తుంది.జైలర్ తెలుగు రిలీజ్ ఉంటుందా లేదా అన్న డౌట్ కూడా ఏర్పడుతుంది.రజిని సినిమాకు తెలుగు రిలీజ్ పక్కా ఉంటుంది.అయితే జైలర్ సినిమా విషయంలో మేకర్స్ ఎందుకో క్లారిటీ మిస్ అవుతుంది. జైలర్ సినిమా( Jailer movie ) ప్రమోషన్స్ లో కూడా అంతగా యాక్టివ్ గా అనిపించడం లేదు.
మరి జైలర్ సినిమా విషయంలో మేకర్స్ ఆలోచన ఏంటన్నది మాత్రం అర్ధం కావట్లేదు.జైలెర్ లో రజిని కూల్ లుక్స్ ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తున్నాయి.
అయితే మేకర్స్ మాత్రం సినిమా ప్రమోషన్స్ చేయడం లేట్ అవుతుండటం సినిమాపై అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి.







