సూపర్ స్టార్ రజినీకాంత్( Rajinikanth ) వయసు మీద పడటం తో సినిమా ల ఎంపిక విషయం లో మునుపటి ఉత్సాహం ను క్రియేటివిటీని ఉపయోగించ లేక పోతున్నారు.ఒకప్పటి రజినీకాంత్ వేరు.
ఇప్పుడు రజినీకాంత్ వేరు అన్నట్లుగా ఆయన అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.సినిమా లు చేస్తున్నారా లేదా అన్నట్లుగా ఆయన సినిమా లు ఉంటున్నాయి.
అప్పుడెప్పుడో వచ్చిన రోబో సినిమా( Robo movie ) తర్వాత ఆ స్థాయి లో కమర్షియల్ విజయాలను సొంతం చేసుకోవడం లో రజినీకాంత్ విపలం అవుతూనే ఉన్నారు.

తమిళంలో ఒక మోస్తరు వసూళ్లు వచ్చినా.తెలుగు మరియు ఇతర భాషల్లో వసూళ్లు జీరో అన్నట్లుగా నమోదు అవుతున్నాయి.మరీ ఇలాంటి పరిస్థితి సూపర్ స్టార్ రజినీకాంత్ కి రావడం దారుణం అన్నట్లుగా కొందరు ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి రజినీకాంత్ యొక్క ప్రస్తుతం సినిమా జైలర్ ( Jailar movie )కి కూడా పెద్దగా బజ్ క్రియేట్ అవ్వడం లేదు.వచ్చే నెలలో జైలర్ సినిమా విడుదల అవ్వబోతుంది.
తెలుగు రాష్ట్రాల్లో గత సినిమా ల ఫలితాల కారణంగా బిజినెస్ అవ్వలేదు అనేది అందరి మాట.ఆ మాట వాస్తవం కూడా.

అయితే తమిళనాట జైలర్ సినిమా ఈజీగా రెండు వందల కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంతా భావించారు.కానీ అది ఎంత వరకు సాధ్యం అనేది క్లారిటీ లేదు.రజినీకాంత్ యొక్క ఇమేజ్ మరియు ఆయన స్టార్ డమ్ కూడా జైలర్ సినిమా కు తమిళ నాట బిజినెస్ ను క్రియేట్ చేయడం లో విఫలం అయ్యింది.ఇంతకు ముందు రజినీకాంత్ సినిమా అంటే పది మంది పంపిణీ దారులు ముందుకు వచ్చేవారు.
కానీ ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువ పరిస్థితి లేదు అనే మాట వాస్తవం అంటూ గత కొన్నాళ్లుగా నిరూపితం అవుతూనే ఉంది.రజినీకాంత్ జైలర్ సినిమా విజయాన్ని అందుకుని మినిమంగా రెండు వందల కోట్ల వసూళ్లు నమోదు చేస్తేనే ఇతర భాషల్లో కూడా ఆయన సినిమా ఉంటుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







