సాధారణంగా సెలబ్రిటీలు కానీ లేదంటే సామాన్యులు పిల్లలకు వారసులు అంటే కొడుకు లేదా కూతురికి బిడ్డ పుడితే వారి ఆనందానికి అవధులు ఉండవు.వారసులను చూసి అమితానందం పొందుతూ ఉంటారు.
వారితో కలిసి ఆడుకుంటూ మళ్లీ చిన్న పిల్లలుగా మారిపోతూ ఉంటారు.కానీ తాజాగా సౌత్ ఇండస్ట్రీలో ఒక హీరో మాత్రం తన వారసులు పుట్టినా కూడా అటు సంతోషం కానీ ఇటు బాధను కానీ వ్యక్తం చేయడం లేదట.
మరి ఆ సౌత్ ఇండియన్ స్టార్ ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్.
సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు సౌందర్య రజిని కాంత్ తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
తల్లి బిడ్డ ఇద్దరూ కూడా క్షేమంగా ఉన్నారు.కానీ రజనీకాంత్ మాత్రం వారసుడిని చూసి బాధని కాని సంతోషాన్ని మానే వ్యక్తం చేయడం లేదట.
దీంతో ఈ విషయం అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇదే విషయంపై రజనీకాంత్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.
కాగా రజినీకాంత్ చిన్న కుమార్తె అయిన సౌందర్య అశ్వినీ రామ్ కుమార్ అనే ఒక వ్యాపారవేత్తను 2010లో వివాహం చేసుకుంది.
అయితే వీరిద్దరికీ వేద్ కృష్ణ అనే ఒక కుమారుడు జన్మించాడు.అయితే ఏడేళ్ల కాపురం తర్వాత వివాదాలు రావడంతో వీరిద్దరు వివాహ బంధానికి స్వస్తి పలికారు 2019లో ఆమె విశాగన్ వనంగమూడి అనే మరో వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుంది.ఆయనకు కూడా ఇది రెండో వివాహమే.
ఇక వీరి వివాహం జరిగిన మూడేళ్ల తర్వాత వీరిద్దరూ తమ చిన్నారికి స్వాగతం పలికారు.ఇక రజనీకాంత్ కుమార్తె అయిన సౌందర్య రజినీకాంత్ దర్శకురాలిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.