ఆ డ్రెస్ కారణంగా సైమాలో కష్టపడిన శ్రీముఖి.. ఆ డ్రెస్సులు అవసరమా అంటూ?

కొంతమంది హీరోయిన్ లు కొన్ని కొన్ని కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు స్టైలిష్ గా, ఆకర్షణీయంగా కనిపించాలి అని వివిధ రకాల మోడల్స్ డ్రస్సులు వేసుకుని వెళ్తూ ఉంటారు.ఈ క్రమంలోనే అవి కొన్ని కొన్ని సార్లు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

 Sreemukhi Feels Uncomfortable With Her Dress At Siima Awards 2022 , Sreemukhi ,-TeluguStop.com

మరి ముఖ్యంగా షార్ట్ డ్రెస్ లు అలాగే టాప్ డ్రెస్ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు.ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఇలా విషయంలో అన్ కంఫర్టబుల్ గానే ఉంటూ నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా ఇలాంటి ఇబ్బందిని మన బుల్లితెర రాములమ్మ శ్రీముఖి కూడా ఎదుర్కొంది.

సైమా అవార్డుల కార్యక్రమంలో విచిత్రమైన డ్రెస్ వేసుకున్న శ్రీముఖి అడ్రస్ విషయంలో కాస్త ఇబ్బందులు పడింది.

ఇక ఆమె డ్రస్సు విషయంలో ఇబ్బంది పడుతుండడం చూసిన మేకప్ మెన్ లు వచ్చి ఆమెను డ్రెస్ ను సరి చేశారు.అయినప్పటికీ శ్రీముఖి మాత్రం ఆ డ్రెస్ విషయంలో అన్ కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతోంది.

ఆ డ్రెస్సులో శ్రీముఖి ఎద భాగం ఎంత కవర్ చేసుకున్నా కూడా ఆమెకు ఇబ్బందిగానే మారిపోయింది.ఇక ఆ డ్రెస్ ని సరి చేసుకోవడానికి శ్రీముఖి అనేక రకాల ఇబ్బందులను పడింది.

అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఇదంతా అవసరమా అంటూ శ్రీముఖి పై ట్రోలింగ్స్ చేస్తున్నారు.

ఇంకొందరు మాత్రం శ్రీముఖికి మద్దతుగానే కామెంట్స్ చేస్తున్నారు.శ్రీముఖి తో పాటుగా ఇప్పటికీ ఎంతోమంది హీరోయిన్లు ఈ విధంగా ముందస్తుగానే ఆ డ్రస్సులు విషయంలో జాగ్రత్త లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.ఏది ఏమైనాప్పటికీ శ్రీముఖి ఆ డ్రెస్ తో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నప్పటికీ బయటికి కనిపించకుండా దానిని నవ్వుతూ కవర్ చేసింది.

అనంతరం ఫోటోలకు ఫోజులిచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube