సీనియర్ ఎన్టీఆర్ రోల్ కు డబ్బింగ్ చెప్పిన రాజేంద్ర ప్రసాద్.. ఏ సినిమా అంటే?

తను నటించిన సినిమాల ద్వారా, రాజకీయాలలో సంచలనాలు సృష్టించడం ద్వారా సీనియర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత దగ్గరయ్యారనే సంగతి తెలిసిందే.ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ సీనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని అనే విషయం చాలా తక్కువ మంది మాత్రమే తెలుసు.

 Rajendra Prasad Dubbing For Senior Ntr Role In Mahanati Movie Details Here,ra-TeluguStop.com

సీనియర్ ఎన్టీఆర్ సలహాతోనే రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.అయితే సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు రాజేంద్ర ప్రసాద్ ఒక సినిమాలో డబ్బింగ్ చెప్పారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

కొన్నేళ్ల క్రితం విడుదలైన మహానటి సినిమా సంచలన విజయం సాధించిందనే సంగతి తెలిసిందే. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది.ఈ సినిమా గురించి అశ్వనీదత్ తాజాగా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు రాజేంద్ర ప్రసాద్ డబ్బింగ్ చెప్పారని ఆయన తెలిపారు.

Telugu Ashwini Dutt, Keerthy Suresh, Mahanati, Nithya Menen, Rajendra Prasad, Se

మహానటి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రోల్ ను జూనియర్ ఎన్టీఆర్ తో చేయించాలని అనుకున్నామని అశ్వనీదత్ అన్నారు.కానీ ఆ సమయానికే బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ గురించి ప్రకటన చేశారని అశ్వనీదత్ తెలిపారు.ఎన్టీఆర్ బయోపిక్ ప్రకటన వెలువడటంతో మహానటి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రను కుదించామని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమాలో అన్నగారి పాత్రను వెనకాల నుంచి చూపించామని ఆయన తెలిపారు.

Telugu Ashwini Dutt, Keerthy Suresh, Mahanati, Nithya Menen, Rajendra Prasad, Se

సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు రెండు డైలాగ్స్ ఉంటాయని ఆయన చెప్పుకొచ్చారు.ఆ డైలాగ్స్ కు రాజేంద్ర ప్రసాద్ చక్కగా డబ్బింగ్ చెప్పారని ఆయన తెలిపారు.మహానటి సినిమా అశ్వనీదత్ కు కళ్లు చెదిరే లాభాలను అందించింది.

మందు తాగే సన్నివేశాలలో నటించనని నిత్యామీనన్ చెప్పడంతో కీర్తి సురేష్ మహానటి సినిమాలోని సావిత్రి పాత్రకు ఎంపికయ్యారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube