బాలీవుడ్ స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకు ఇప్పుడు అంతా కూడా ఓటీటీ దారి పడుతున్నారు.చాలా మంది సినిమాల్లో ఆఫర్లు రాని వారు వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ కెరీర్ ను నెట్టుకు పోతున్నారు.
కొందరు హీరోలు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా అక్కడ ప్రాజెక్ట్ లు ఉన్నా కూడా ఓటీటీ చేస్తూనే ఉన్నారు.వెబ్ కంటెంట్ విషయంలో చాలా మందికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఓటీటీలో నటించినంత మాత్రాన తక్కువ కాదు అనే అభిప్రాయం రావడంతో అంతా కూడా ఇప్పుడు ఓటీటీ దారిలో నడుస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రాజశేఖర్ కూడా ఓటీటీ కోసం ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
సినిమాలతో ఈయన ఆకట్టుకోలేక పోతున్నాడు.కనుక ఓటీటీ ద్వారా వస్తాడేమో చూడాలి.
ఓటీటీల్లో సినిమాకు సంబంధించిన స్టార్ హీరోలు అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరో ఓటీటీ కోసం వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఓటీటీ చేయవచ్చు అంటున్నారు.
ఈ విషయంలో రాజశేఖర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చాడట.కొత్త దర్శకుడు చెప్పిన వెబ్ సిరీస్ స్టోరీ నచ్చడంతో చేసేందుకు సిద్దం అయ్యాడట.ఆ విషయంలో తుది చర్చలు జరుగుతున్నాయి.త్వరలోనే రాజశేఖర్ నుండి ఒక నిర్ణయం వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

రాజశేఖర్ ఇద్దరు కూతుర్లు కూడా హీరోయిన్స్‌గా పరిచయం అవుతున్నారు. చిన్న కూతురు శివాత్మిక ఇప్పటికే దొరసాని సినిమాలో నటించింది.మరో వైపు రంగ మార్తాండ సినిమాలో నటిస్తోంది.శివాని ఒక సినిమా ప్రారంభం అయ్యి క్యాన్సిల్ అయ్యింది.దాంతో కొత్త సినిమాలో ఆమె నటిస్తుంది.వీరిద్దరు కూడా తండ్రితో కలిసి ఆ వెబ్ సిరీస్ లో నటించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.
అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో వెబ్ సిరీస్ ను రూపొందించే అవకాశం ఉందంటున్నారు.