రాజశేఖర్ కూతురుకు అదే మైనస్.. అందంగా ఉన్నా ఛాన్స్ లు లేవంటూ?

యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ సినిమాలు ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే.రాజశేఖర్ కూతుళ్లు కూడా సినిమా ఇండస్ట్రీలో లక్ ను పరీక్షించుకుంటుండగా శివానికి మంచి గుర్తింపు దక్కితే శివాత్మికకు మాత్రం ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కలేదు.

 Rajasekhar Daughter Shivatmika Drawbacks Details Here Goes Viral,rajasekhar,shiv-TeluguStop.com

దొరసాని సినిమాతో శివాత్మిక టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

రంగమార్తాండ సినిమాలో శివాత్మిక కీలక పాత్రలో నటించగా ఈ సినిమాతో అయినా శివాత్మికకు కోరుకున్న సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.

శివాత్మిక గురించి కొన్నిరోజుల క్రితం రూమర్లు ప్రచారంలోకి వచ్చినా ఆ రూమర్లలో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు.వెబ్ సిరీస్ లలో, తెలుగు, తమిళ సినిమాలలో ఆమె నటిస్తుండటం గమనార్హం.

రంగమార్తాండతో కచ్చితంగా సక్సెస్ దక్కుతుందని శివాత్మిక భావిస్తున్నారు.

Telugu Career, Dorasani, Krishna Vamshi, Rajasekhar, Rangamarthanda, Shivatmika,

కృష్ణవంశీ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఆయన ఫ్యాన్స్ సైతం నమ్ముతున్నారు.రమ్యకృష్ణ, కృష్ణవంశీ కాంబినేషన్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేని కృష్ణవంశీ ఈ సినిమాతో ఫామ్ లోకి వస్తానని బలంగా నమ్ముతున్నారు.

అనసూయ ఈ సినిమాలో దేవదాసిగా కనిపిస్తుండటం గమనార్హం.

యూత్ మెచ్చే పాత్రలను ఎంచుకోవడంలో శివాత్మిక ఫెయిల్ అవుతున్నారని అదే ఆమెకు మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ కామెంట్లను దృష్టిలో ఉంచుకుని కథల ఎంపికలో శివాత్మిక జాగ్రత్త వహించాల్సి ఉంది.శివాత్మిక తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

శివాత్మిక భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే ఆమె కెరీర్ కు ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube