ఇజ్రాయిల్ స్టడీ టూర్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా రైతు బందు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా: వ్యవసాయాన్ని పండుగల చేసి రైతును రాజుగా చూడాలనే సదుద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే అన్నం పెట్టే ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దాలనే దృడసంకల్పంతో అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రైతు పక్షపాతి సీఎం కేసీఅర్ ఆదేశాలతో, వ్యవసాయంలో నూతన పద్ధతులను అధ్యయనం చేసేందుకు పర్యటించే రాష్ట్రస్థాయి బృందంలో సిరిసిల్ల జిల్లా రైతుబంధు అధ్యక్షులు గడ్డం నర్సయ్య నుఎంపిక చేశారు.

రాష్ట్ర వ్యవసాయ , కోఆపరేటివ్ శాఖవారి ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసా పద్దతులు మరియు సాంకేతిక పద్దతులతో “ ఇజ్రాయిల్ “ దేశంలో కొనసాగుతున్న అన్ని రకాల లాభసాటిగా కొనసాగుతున్న వ్యవసాయ విధానాలను తెలుసుకొనుటకు,అవగాహన చేసుకొని మన రైతన్నలనా చైతన్యపరుచుటకు గాను ఈనెల 5వ తేదీనుండి 10వ తేదీ వరకు ఇజ్రాయిల్ దేశం కు స్టడీ టూర్ కు ఎంపికైన రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుబందు అధ్యక్షులు గడ్డం నర్సయ్య .

ఈ స్టడీ టూర్ మన రైతాంగానికి ఉపయోగ పడుతుందని ఇజ్రాయిల్ స్టడీ టూర్‌కు నన్ను ఎంపిక చేసినందులకు ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రివర్యులు కేటిఆర్,నిరంజన్ రెడ్డి,ఆర్ బియస్ అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డికి గడ్డం నరసయ్య కృతజ్ఞతలు తెలిపారు.

సూర్య భయ్యా, నువ్వు సూపర్.. రహానే సెంచరీ కోసం ఇంత త్యాగమా..?

Latest Rajanna Sircilla News