రాజన్న సిరిసిల్ల జిల్లాలో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.బ్లఫ్ మాస్టర్ సినిమా తరహాలో కేటుగాడు మోసాలకు పాల్పడ్డాడని తెలుస్తోంది.
ఈజీ మనీ కోసం అలవాడు పడిన రమేశ్ చారీ నిరుద్యోగులే టార్గెట్ గా గతంలో కోట్లాది రూపాయలు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు.తాజాగా ఆన్ లైన్ బిజినెస్ పేరిట అతి తక్కువ ధరకే ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తామంటూ పలువురిని మోసం చేశాడని గుర్తించారు.
రమేశ్ చారీని నమ్మి పెట్టుబడులు పెట్టామని బాధితులు వాపోతున్నారు.కాగా నిందితుడు ఇప్పటివరకు రూ.50 కోట్లు కాజేశాడని తెలుస్తోంది.బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు రమేశ్ చారీని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు.