టాలీవుడ్ లో అగ్ర దర్శకుడుగా వెలుగొందుతున్నాడు జక్కన్న.ఈయన ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా చూడలేదు.
అందుకే 99 శాతం సక్సెస్ రేట్ ను కలిగి ఉన్నాడు రాజమౌళి.ప్రసెంట్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఎందరో లెజెండరీ డైరెక్టర్లలో రాజమౌళికి తప్ప మరే డైరెక్టర్ కు ఈ సక్సెస్ రేట్ లేదు.
ఒక్క రాజమౌళి మాత్రమే చేసిన ప్రతి సినిమా హిట్ అయ్యి సక్సెస్ రేట్ లో 99 శాతం కలిగి ఉన్నాడు.
ఈయన ట్రెండ్ ఫాలో అవ్వడు.
ట్రెండ్ సెట్ చేస్తాడు.ఈయన బాహుబలి సినిమాతో ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎదిగాడు.
ప్రెసెంట్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో మరోసారి ట్రెండ్ సెట్ చేయడానికి రెడీ అయ్యాడు.ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
ఇలా ఆయన తీసే సినిమా ఒక్కోటి ఒక్కో ట్రెండ్ సెట్ చేయడమే కాకుండా మన టాలీవుడ్ ను మరో లెవల్ కు తీసుకు వెళ్తున్నాడు.

ఒకప్పుడు టాలీవుడ్ ను ప్రాంతీయ భాషగా మాత్రమే చూసే వారంతా ఇప్పుడు బాలీవుడ్ కంటే మించి అన్నట్టు చూస్తున్నారు.తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఏకంగా హాలీవుడ్ రేంజ్ సినిమా తీసాడు ఇక అక్కడ కూడా మన టాలీవుడ్ సినిమా ఇలా ఉంటుంది అని పరిచయం చేయనున్నాడు.దీంతో ఈయన క్రేజ్ మాములుగా పెరగలేదు.

అందుకు నిదర్శనంగా తాజాగా ఈయనకు భారీ కటౌట్ ను ఏర్పాటు చేసారు.ఎప్పుడు మన ఇండస్ట్రీలో హీరోలకు మాత్రమే కటౌట్ లు ఏర్పాటు చేయడం చూసాం.కానీ మొదటి సారి ఒక డైరెక్టర్ కు కూడా కటౌట్ ఏర్పాటు చేసి ఆయన క్రేజ్ ఎంతో నిరూపించారు.తాజాగా హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్ దగ్గర రాజమౌళి భారీ కటౌట్ ను ఏర్పాటు చేసారు.
ఈ కటౌట్ ఇప్పుడు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది.







