ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి రాజమౌళి భార్య కారణమా.. ఆ మూవీ వెనుక అసలు కథ ఇదే!

Rajamouli Wife Behind Prabhas Mirhci Details Here Goes Viral , Baahubali , Rajamouli Wife, Anushka , Rama Rajamouli ,mirchi Movie , Koratala Siva

ప్రభాస్ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్ల జాబితాలో మిర్చి మూవీ ( Mirchi )ముందువరసలో ఉంటుంది.కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఆడియన్స్ తో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పించింది.

 Rajamouli Wife Behind Prabhas Mirhci Details Here Goes Viral , Baahubali , Ra-TeluguStop.com

అయితే ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి రాజమౌళి భార్య కారణం కావడం గమనార్హం.వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా రాజమౌళి భార్య చేసిన పని వల్లే ప్రభాస్ ఈ సినిమాలో నటించారు.

రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్ లో మర్యాదరామన్న తర్వాతే బాహుబలి సినిమా తెరకెక్కాల్సి ఉండగా రాజమౌళి ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈగ సినిమాను త్వరగా పూర్తి చేయాలని మొదలుపెట్టారు.అయితే ఆ సినిమాకు జక్కన్న రెండేళ్ల సమయం కేటాయించడంతో ప్రభాస్ ప్లాన్స్ కూడా మారిపోయాయి.రాజమౌళి అనుమతితో ప్రభాస్ లారెన్స్ డైరెక్షన్ లో రెబల్ సినిమాలో నటించారు.

రెబల్ సినిమా షూట్ పూర్తైన తర్వాత కొరటాల శివ( Koratala Siva ) వినిపించిన మిర్చి కథ ప్రభాస్ కు ఎంతగానో నచ్చింది.అయితే బాహుబలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఏం చేయాలో ప్రభాస్ కు పాలుపోలేదు.ఈ విషయం తెలిసిన రమా రాజమౌళి జక్కన్న సినిమా అంటే సమయం పడుతుందని మిర్చి సినిమాను పూర్తి చేసి బాహుబలి షూటింగ్ లో పాల్గొనాలని ప్రభాస్ కు సూచించారు.

రమా రాజమౌళి సపోర్ట్ లభించడంతో ప్రభాస్ మిర్చి సినిమా షూటింగ్ లో ఆ సినిమాతో సక్సెస్ సాధించారు. మిర్చి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ప్రభాస్ ప్రస్తుతం ప్రతి సినిమాను 300 కోట్ల రూపాయల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ప్రభాస్ సలార్ కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube