టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్న నందమూరి మరియు మెగా కాంబో మూవీ పట్టాలెక్కిన సందర్బంగా ప్రేక్షకులు అంతా కూడా సంతోషంగా ఉన్నారు.
జక్కన్న మూవీ అంటే ఖచ్చితంగా అద్బుతాలు ఆవిష్కారం అవుతాయి.అందుకే ఈ చిత్రంలో కూడా తప్పకుండా అద్బుతాలు ఉంటాయని అంతా ఆశిస్తున్నారు.
ఇక జక్కన్న మూవీలో విలన్ పాత్రకు హీరో స్థాయిలో ప్రాముఖ్యత ఉంటుంది.జక్కన్న మూవీలో విలన్‌గా నటించేందుకు అంతా కూడా ఆసక్తి చూపుతారు.

జక్కన్న రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్ మూవీలో ఎవరిని విలన్‌గా తీసుకు వస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విన్ పాత్రకు గాను కన్నడ స్టార్ హీరో యష్ ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.కన్నడంలో మంచి హీరోగా గుర్తింపు దక్కించుకున్న యష్ త్వరలో ‘కేజీఎఫ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.తెలుగులో కూడా ఈ చిత్రం భారీ ఎత్తున విడుదలకు సిద్దం అయ్యింది.
తెలుగులో యష్ ఎంట్రీ కాబోతున్న నేపథ్యంలో మల్టీస్టారర్‌లో కూడా అతడిని తీసుకోవాలని జక్కన్న భావిస్తున్నాడు.

రాజమౌళి తన ‘ఈగ’ చిత్రంలో కన్నడ స్టార్ హీరో సుదీప్‌ను విలన్‌గా నటింపజేసిన విషయం తెల్సిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు సుదీప్‌కు తెలుగులో స్టార్ డం దక్కింది.ఇక అదే ఫార్ములాను మల్టీస్టారర్‌కు కూడా వర్తింపజేయాలనే ఉద్దేశ్యంతో జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
తెలుగులో యష్ ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలి.ఆర్ మల్టీస్టారర్ మూవీ 2020లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.