విజయ్ దేవరకొండ ఈమద్య కాలంలో మోస్ట్ క్రేజీ హీరోగా పేరు దక్కించుకున్నాడు.యూత్‌లో విజయ్ దేవరకొండ అంటే పిచెక్కి పోతున్నారు.
ముఖ్యంగా ఆయనకు లేడీ ఫ్యాన్స్ మరీ ఎక్కువ అయ్యారు.ఈయన ఏ సినిమా చేసినా మినిమం గ్యారెంటీ అంటూ నమ్మకం ఏర్పడినది.
దాంతో ఈయనతో సినిమాలకు పెద్ద ఎత్తున నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న సినిమాలు చేస్తూ, భారీ వసూళ్లను రాబడుతున్న విజయ్ దేవరకొండ అందుకుంటున్న పారితోషికం మాత్రం నామమాత్రంగానే ఉంటోంది.

‘పెళ్లి చూపులు’ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.ఆ చిత్రం నిర్మాతకు లాభాల పంట పండివ్వడం జరిగింది.అయితే ఆ సినిమాకు విజయ్ అందుకున్న పారితోషికం అయిదు లక్షల లోపే అంటూ సమాచారం అందుతోంది.ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమా చేసిన విజయ్ దేవరకొండ నిర్మాతలకు కాసుల పంట పండివ్వడం జరిగింది.
ఆ సినిమాకు విజయ్ దేవరకొండ పారితోషికం 15 లక్షలకు కాస్త అటు ఇటుగానే ఉందట.ఇక ‘గీత గోవిందం’ చిత్రానికి కూడా 30 నుండి 40 లక్షలు మాత్రమే తీసుకున్నాడట.
వంద కోట్లు వసూళ్లు చేసిన సినిమాలో నటించిన హీరో పారితోషికం అంత తక్కువ అంటే ఏ ఒక్కరు నమ్మరు.

ఇక నోటా పరిస్థితి కూడా అంతే నోటా కేవలం కేవలం 30 లక్షలు మాత్రమే విజయ్ దేవరకొండ తీసుకున్నట్లుగా చెబుతున్నారు.తాజాగా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ట్యాక్సీవాలా చిత్రంకు కూడా విజయ్ పారితోషికం అంతేనంటూ ప్రచారం జరుగుతోంది.30 నుండి 40 లక్షలు మాత్రమే తీసుకున్నాడట.సినిమా విడుదలై భారీ వసూళ్లు సాధిస్తున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండుకు ఏమైనా లాభాల్లో వాటా దక్కుతుందో లేదో తెలియదు, కాని మొదట కమిట్ అయిన పారితోషికాలు మాత్రం మరీ దారుణం.ప్రస్తుతం చేస్తున్న డియర్ కామ్రెడ్ చిత్రంకు కూడా విజయ్ తక్కువ పారితోషికాన్నే అందుకుంటున్నాడు.
ఒక్క సినిమా సక్సెస్ అయితేనే కోట్లు డిమాండ్ చేసే హీరోలు ఉంటే విజయ్ మాత్రం తక్కువ పారితోషికంతోనే కెరీర్‌ను నెట్టుకు వస్తున్నాడు.







