రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి.ఎందుకంటే ఈయన లాంటి విజన్ ఉన్న దర్శకుడు ఇండియాలోనే లేడని చెప్పాలి.
ప్రస్తుతం ఈయన ఇండియన్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ అంటే ఒప్పుకోవడం లేదు.
ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నుంచి నెంబర్ వన్ డైరెక్టర్లుగా ఉన్న వాళ్లు కొత్తగా రాజమౌళి నెంబర్ వన్ డైరెక్టర్ అంటే వాళ్లకి ఇబ్బంది గా అనిపిస్తుంది.దాంతో వాళ్లు రాజమౌళిని తక్కువ చేసి మాట్లాడుతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.
నిజానికి రాజమౌళి స్టామినా ఏంటో వాళ్ళకి ఇంకా పూర్తిగా అర్థం కానట్టుంది అంటూ మరి కొంతమంది సోషల్ మీడియా వేదికగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా ఇలాంటి దర్శకుడు ఇక సినిమా చేస్తున్నాడు అంటే ఆ సినిమా మీద భారీ అంచనాలు నెలకొనడమే కాకుండా ఆ సినిమా కోసం పూర్తి ఎఫర్ట్ పెట్టీ దానికి బెస్ట్ ఔట్ పుట్ అయితే తీసుకురావాలని తన పరిధి మించి కష్టపడుతూ అంతకుమించి అవుట్ పుట్ తీసుకొస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ప్రస్తుతం రాజమౌళి తనకంటూ ఒక భారీ మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు.అందులో భాగంగానే వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) హీరోగా పాన్ ఇండియా లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే ఇక రాజమౌళిని ఆపే వారు ఎవరు ఉండరు అనేది వాస్తవం.ఆయన చేస్తున్న సినిమాలే ఆయన్ని ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తున్నాయి ఎవరు ఆయన్ని ఎంత ఎక్కువ చేసి మాట్లాడిన, తక్కువ చేసి మాట్లాడిన ఆయనకు పోయేదేం లేదు ఎందుకంటే ఆయన ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది.జేమ్స్ కెమరూన్ లాంటి డైరెక్టర్ రాజమౌళిని పిలిచి ఆయన సినిమా చూశాను అని చెప్పి ఆయనతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు…
.