దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.
రాజమౌళి మార్చి 14 వ తారీకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ తో భేటీ అయ్యారు. “RRR” ఈ నెల 25వ తారీకు విడుదల కానున్న తరుణంలో.
సినిమా టికెట్ వివాదానికి సంబంధించి నిర్మాత డివివి దానయ్య తో కలిసి సీఎం జగన్ తో రాజమౌళి సమావేశమయ్యారు.అనంతరం రాజమౌళి మరియు దానయ్య మీడియాతో మాట్లాడుతూ… సీఎం జగన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అని పేర్కొన్నారు.
“ఆర్ఆర్ఆర్” భారీ బడ్జెట్ సినిమా.కనుక సీఎం జగన్.
కచ్చితంగా సినిమా కి న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు రాజమౌళి తెలియజేశారు.ఉన్న ఇబ్బందులపై సానుకూలంగా స్పందించారని సీఎం జగన్ మాతో చాలా బాగా మాట్లాడారు అంటూ రాజమౌళి పేర్కొన్నారు.
సినిమా టికెట్ లకు సంబంధించి ఇటీవల ఏపీ ప్రభుత్వం కొత్త జీవో విడుదల చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో “RRR” అతి పెద్ద భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఉన్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఆయన సానుకూలంగా స్పందించినట్లు మీడియాతో తెలిపారు.“బాహుబలి” తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై దేశంలోనే కాదు ప్రపంచంలో భారీ అంచనాలు ఉన్నాయి.ఈనెల 25 వ తారీఖున “RRR” రిలీజవుతోంది.