రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా.. నిర్మాతకు లాభాలు రాలేదా?

ఏదైనా పెద్ద సినిమా విడుదల అయ్యింది అంటే చాలు ఆ సినిమాకు ఎన్ని వసూళ్లు సాధిస్తుంది.ఎలాంటి రికార్డులు కొల్లగొట్టింది అన్న విషయాలను ఎక్కువగా చూస్తూ ఉంటారు.ఇక బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా గురించి కూడా ఇలాంటిదే వెతకడం ప్రారంభించారు.

 Rajamouli Rrr Movie Benefits To Producer Dvv Danayya Details, Rrr, Director Raja-TeluguStop.com

450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది.ఇక ఈ సినిమా విడుదలై రికార్డులను కోళ్లగొట్టి ఎంతో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అయితే రోజులు గడిచే కొద్దీ బాక్సాఫీస్ వద్ద వసూలు తగ్గిపోతూ వుంటాయి.

ఇది ఏ సినిమాకైనా సహజం.

ఇకపోతే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నిర్మాతకు వచ్చిన లాభాలు గురించి ఒక వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

త్రిబుల్ ఆర్ సినిమా రెమ్యూనరేషన్ తో సహా మొత్తంగా 450 కోట్ల బడ్జెట్ తో రూపొందించబడింది.అయితే నిర్మాత డివివి దానయ్య ఈ సినిమాను థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటు హక్కులను మొత్తం 700 కోట్లకు విక్రయించినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా ద్వారా నిర్మాత డి.వి.వి.దానయ్య పెద్దగా సంపాదించలేదట.

Telugu Budget, Rajamouli, Dvv Danayya, Ram Charan, Rrr, Rrr Profits-Movie

కేవలం 25 కోట్ల లాభాలు మాత్రమే డి.వి.వి.దానయ్య పొందారట అంటూ ప్రచారం జరుగుతోంది.త్రిబుల్ ఆర్ సినిమా కోసం దానయ్య ఇతరుల నుంచి డబ్బు తీసుకుని ఇక సినిమా పెట్టుబడిగా పెట్టారని ఇక ఇప్పుడు వచ్చిన డబ్బులతో అటు అప్పు వారందరికీ వడ్డీతో సహా అప్పజెప్పాక ఇక చివరకు మిగిలింది 25 కోట్లు మాత్రమేనట

అంతేకాదు రాజమౌళి ఫ్యామిలీ మొత్తం సినిమాని ఓన్ చేసుకుని సమయంలో సినిమా లాభాలు ఎక్కువ భాగం వాళ్ళు తీసుకున్నారంటూ మరో పుకారు కూడా హల్ చల్ చేస్తోంది.సాధారణంగా ఇక సినిమా బడ్జెట్లో కనీసం పాతిక శాతం అయినా లాభాలు పొందాలని అనుకుంటారు నిర్మాతలు.

Telugu Budget, Rajamouli, Dvv Danayya, Ram Charan, Rrr, Rrr Profits-Movie

ఈ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించిన డి.వి.వి.దానయ్య మాత్రం అన్ని పోనూ కేవలం 25 కోట్లు మాత్రమే మిగిలాయి.ఇక దీనికి సంబంధించి ఒక పుకారు మాత్రం తెగ చక్కెర్లు కొడుతుంది.టాలీవుడ్లో ఈ విషయంపై అటు చిత్ర బృందం స్పందిస్తే కానీ క్లారిటీ రాదు అని చెప్పాలి.

అంతేకాదు ఇక రాజమౌళి ఏ సినిమా తీసినా వచ్చిన లాభాల్లో సగం రాజమౌళి కుటుంబానికి కూడా వెళుతుందట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube